Vishal Mark Antony : విశాల్ కొత్త మూవీ షూటింగ్‌లో యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో!

విశాల్ నటిస్తున్న కొత్త మూవీ 'మార్క్ ఆంటోనీ' శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం మూవీలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తుంది. కాగా ఈ షూటింగ్ లో..

Vishal Mark Antony : విశాల్ కొత్త మూవీ షూటింగ్‌లో యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో!

an accident happened in Vishal Mark Antony movie sets

Vishal Mark Antony : తమిళ యాక్షన్ హీరో విశాల్ రీసెంట్ గా ‘లాఠీ’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేక పోయింది. దీంతో ఇప్పుడు మరో యాక్షన్ మూవీని సిద్ధం చేస్తున్నాడు విశాల్. ‘మార్క్ ఆంటోనీ’ అనే ఒక రా అండ్ రస్టిక్ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

Sunil: తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సునీల్.. హీరో ఎవరంటే?

ప్రస్తుతం మూవీలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తుంది. కాగా ఈ షూటింగ్ లో అనుకోని ప్రమాదం జరిగింది. గోడని ఢీ కొట్టుకొని ఒక వెహికల్ లోపలికి రావాలి. అయితే ఢీ కొట్టిన తరువాత వెహికల్ అదుపుతప్పడంతో ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ల మీదకు దూసుకు వచ్చింది. అయితే అదుపుతప్పిన విషయాన్ని గమనించిన ఆర్టిస్ట్ లు అక్కడి నుంచి తప్పించుకోవడంతో ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. దీంతో మూవీ టీం ఊపిరి పీల్చుకుంది.

కాగా ఆ వీడియోని సెట్ లోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీలో టాలీవుడ్ యాక్టర్స్ ఇద్దరు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప సినిమాతో విలన్ గా మారిన సునీల్.. ఈ సినిమాలో విలన్ తరహా పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే తెలుగు అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జె సూర్య, అభినయ, రెడిన్ కింగ్స్లీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.