ఒకటి బతకాలంటే ఇంకోటి చావాల్సిందే.. అది సృష్టి..

  • Published By: sekhar ,Published On : November 11, 2020 / 12:30 PM IST
ఒకటి బతకాలంటే ఇంకోటి చావాల్సిందే.. అది సృష్టి..

Anaganaga O Athidhi Teaser: కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్, సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ లో మరో వైవిధ్యభరితమైన మూవీ రాబోతోంది. ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ నటీనటులుగా దయాల్ పద్మనాభన్ తెరకెక్కించిన పీరియాడిక్ థ్రిల్లర్.. ‘అనగనగా ఓ అతిథి’.. బుధవారం టీజర్ రిలీజ్ చేశారు.




విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్ ఇదని తెలుస్తోంది. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. పాయల్ గెటప్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. డీఓపీ రాకేష్ విజువల్స్, మ్యూజిక్ డైరెక్టర్ అరోల్ కొరెల్లి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ‘అనగనగా ఓ అతిథి’ త్వరలో ప్రేక్షకులముందుకు రానుంది.
ట్రైలర్ ఎలా ఉందో చూసెయ్యండి మరి..