Anaganaga Oka Raju : రాజు గాడి పెళ్లిక్కడ.. నవీన్ పొలిశెట్టి అరిపించేసాడంతే!

నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ టైటిల్ టీజర్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది..

Anaganaga Oka Raju : రాజు గాడి పెళ్లిక్కడ.. నవీన్ పొలిశెట్టి అరిపించేసాడంతే!

Anaganaga Oka Raju

Anaganaga Oka Raju: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘చిచ్చోరే’ (హిందీ) సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Naveen Polishetty : వరుస సినిమాలతో బిజీగా మారిన నవీన్ పోలిశెట్టి..

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార సంస్థ కలిసి నవీన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.

Unstoppable : మద్యం మీద పద్యం.. బాలయ్య మామూలోడు కాదయ్యో!

ఇటీవల నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో నుండి నవీన్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కనుమ పండుగ సందర్భంగా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఫన్ రైడర్‌కి ‘అనగనగా ఒక రాజు’ అనే క్యాచీ టైటిల్ పెట్టారు.

Jayamma Panchayathi : సుమ ర్యాప్ పాడితే అదిరిపోద్దంతే..

ఇక టీజర్‌లో నవీన్ చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు.. డైలాగులతో అరిపించేసాడు.. రాజు గాడి పెళ్లి హడావిడి రెండు నిమిషాల టీజర్‌లోనే ఇలా ఉందంటే.. ఇక సినిమాలో ఏ రేంజ్‌లో నవ్విస్తాడో ఊహించుకోవచ్చు. త్వరలో ‘అనగనగా ఒకరాజు’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.