Highway: దేవరకొండ కొత్త సినిమా.. ‘హైవే’ షూటింగ్ స్టార్ట్!

దొరసాని సినిమాతో విజయ్ దేవరకకొండ తమ్ముడు ఆనంద్ తెలుగు సినిమాకు పరిచయమైన సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న ఆనంద్ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈక్రమంలోనే కేవీ గుహన్ లాంటి టాలెంటెడ్ దర్శకుడితో జతకట్టి ఓ సరికొత్త సైకో క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు.

Highway: దేవరకొండ కొత్త సినిమా.. ‘హైవే’ షూటింగ్ స్టార్ట్!

Highway

Highway: దొరసాని సినిమాతో విజయ్ దేవరకకొండ తమ్ముడు ఆనంద్ తెలుగు సినిమాకు పరిచయమైన సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న ఆనంద్ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈక్రమంలోనే కేవీ గుహన్ లాంటి టాలెంటెడ్ దర్శకుడితో జతకట్టి ఓ సరికొత్త సైకో క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. హైవే పేరుతో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ సినిమాకు ‘ఏ నర్వ్‌ వ్రాకింగ్‌ రైడ్‌ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్‌ పెట్టారు.

దీనిని బట్టి చూస్తే ఇది రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆనంద్ కు జోడిగా మలయాళీ భామ మానస రాధాకృష్ణన్‌ నటిస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్న సినిమాలో హీరోయిన్ గా మానస ఫైనల్ అయిందంటూ ఆ మధ్య ప్రచారం జరగగా అది ఎంతవరకు నిజమో కానీ హైవే టీం అయితే.. మానసను ఫైనల్ చేసి షూటింగ్ కూడా మొదలుపెట్టి ఓ పోస్టర్ విడుదల చేశారు.

ఇక, గుహన్ విషయానికొస్తే ‘అతడు’ నుండి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘బాద్ షా’ వరకు ఎన్నో భారీ తెలుగు సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన గుహన్ కళ్యాణ్ రామ్ హీరోగా 118 సినిమాతో తెలుగులో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే, ఈసారి ఎలాగైనా భారీ సక్సెస్ కొట్టాలనే భావనలో ఉన్న గుహన్.. ఆనంద్ తో కలిసి ఇలా హైవేతో వస్తున్నాడు. మరి ఈ సినిమా ఇద్దరికీ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి!