Naatu Naatu : మొన్న కొరియన్, నేడు జర్మన్ ఎంబసీ.. నాటు నాటు పై ఆనంద్ మహేంద్ర ట్వీట్!

గ్లోబల్ సెన్సేషన్ గా నిలిచిన 'RRR'కి ఎం ఎం కీరవాణి అందించిన 'నాటు నాటు' సాంగ్ ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో మనందిరికి తెలిసిందే. ఇటీవలే ఈ పాటకి కొరియన్ ఎంబసీ చిందేయగా, తాజాగా..

Naatu Naatu : మొన్న కొరియన్, నేడు జర్మన్ ఎంబసీ.. నాటు నాటు పై ఆనంద్ మహేంద్ర ట్వీట్!

anand mahindra tweet on german embassy naatu naatu performance

Naatu Naatu : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన మల్టీస్టార్రర్ చిత్రం ‘RRR’. గ్లోబల్ సెన్సేషన్ గా నిలిచిన ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అందించిన ‘నాటు నాటు’ సాంగ్ ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో మనందిరికి తెలిసిందే. చంద్రబోస్ క్యాచీ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ స్టెప్పులు, ఎన్టీఆర్ అండ్ చరణ్ ఎనర్జీ ప్రపంచంలోని ప్రతి ఒక్కర్ని ఊర్రుతలుగించింది. ఇటీవలే ఆస్కార్ కూడా అందుకొని వరల్డ్స్ బెస్ట్ సాంగ్ గా నిలిచింది. కాగా ఈ పాట జనరల్ ఫారిన్ ఆడియన్స్ ని మాత్రమే కాదు, ఫారిన్ అధికారులను సైతం చిందేసేలా చేస్తుంది.

Naatu Naatu Song : నాటు నాటు సాంగ్ కి కొరియన్స్ డ్యాన్స్.. ప్రధాని మోదీ ట్వీట్..

ఇటీవలే కొరియాలోని కొరియన్ ఎంబసీ ఇండియా అధికార ప్రతినిధి అయిన చాంగ్ జె బాక్ మరియు ఎంబసీలో పనిచేసి 50 మంది కొరియన్ అండ్ ఇండియన్ స్టాఫ్ తో కలిసి నాటు నాటు సాంగ్ కి డాన్స్ వేసి ఆ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియో పై ప్రధాని నరేంద్ర మోదీ కూడా కామెంట్ చేశారు. తాజాగా ఇండియాలోని జర్మన్ ఎంబసీ అధికారి మరియు ఎంబసీ స్టాఫ్ కలిసి దేశ రాజధాని ఢిల్లీ విధుల్లో నాటు నాటు సాంగ్ కి డాన్స్ వేసిన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో స్టార్టింగ్ లో జర్మన్ ఎంబసీ అధికారి ఢిల్లీలోని ఒక చిరు వ్యాపారిని ఇండియా వరల్డ్ ఫేమస్ అని అడగా.. ఆ వ్యాపారి ‘నాటు నాటు’ అని రాసి ఉన్నది ఇస్తాడు.

అక్కడి నుంచి సాంగ్ స్టార్ట్ అయ్యి ఢిల్లీలోని చాందిని చౌక్ లో జర్మన్ ఎంబసీ మెంబెర్స్ అంతా నాటు నాటుకి డాన్స్ వేస్తుంటుంటే జనాలు అంతా ఫోన్ లతో దానిని వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర రీ ట్వీట్ చేస్తూ.. ”మొన్న కొరియన్ ఎంబసీ, నేడు జర్మన్ ఎంబసీ. నాటు నాటు ఒక ప్రపంచ గీతంగా మారడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి తరువాత ఏ దేశం ఎంబసీ నాటు నాటుకి చిందేయబోతుంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.