Ananya Pandey : రష్మిక పాటకు దుబాయ్‌లో స్టెప్పులేస్తున్న లైగర్ భామ..

అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు ఖండాతరాలు దాటి మరీ.............

Ananya Pandey : రష్మిక పాటకు దుబాయ్‌లో స్టెప్పులేస్తున్న లైగర్ భామ..

Ananya

Ananya Pandey :  అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు ఖండాతరాలు దాటి మరీ భారీ విజయం సాధించాయి. సినిమా పాటలు రిలీజైన సమయంలో రీల్స్ రూపంలో బాగా పాపులర్ అయ్యాయి. అలా పాపులర్ అయిన పాటల్లో సామి సామి సాంగ్ ఒకటి. ఈ సాంగ్ తో పాటు సాంగ్ లో రష్మిక చేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ పాటకు స్టెప్పులు వేసి రీల్స్ రూపంలో సోషల్ మీడియాలలో పోస్ట్ చేశారు. పలువురు సెలబ్రిటీలు కూడా సామి నా సామి అంటూ రష్మిక స్టెప్పులని అనుకరించారు.

DilRaju : F4 కూడా రెడీ చేస్తున్నాం.. త్వరలోనే అనౌన్స్..

తాజాగా ఈ పాటకి బాలీవుడ్ భామ అనన్య పాండే స్టెప్పులు వేసింది. ఇంకా తెలుగు సినిమాల్లోకి రాకముందే లైగర్ తో రాబోతుంది అని తెలిసి అనన్య పాండే కి తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇటీవల ఐఫా వేడుకలు దుబాయ్ లో జరుగగా పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల అనంతరం బాలీవుడ్ భామలు సరదాగా హోటల్ రూమ్స్ లో ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ లో భాగంగా అనన్య పాండే ఇలా రష్మిక సామి నా సామి అనే పాటకి వేసిన స్టెప్పులని వేసి అలరించింది. దీంతో పుష్ప మానియా ఇంకా నడుస్తుంది అని బన్నీ అభిమానులు అనన్య డ్యాన్స్ వేసిన వీడియోని వైరల్ చేస్తున్నారు.