Anasuya : ‘బంగార్రాజు’లో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు.. స్టేజి పైనే డైరెక్టర్‌ని అడిగేసిన అనసూయ

అనసూయ మాట్లాడుతూ.. ''బంగార్రాజు సినిమాలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు? నన్ను ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు అందరి ముందు చెప్పాలి'' అని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణని..............

Anasuya : ‘బంగార్రాజు’లో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు.. స్టేజి పైనే డైరెక్టర్‌ని అడిగేసిన అనసూయ

Anasuya

Anasuya :  నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా ఇవాళ సంక్రాంతికి రిలీజ్ అయింది. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ‘బంగార్రాజు’ సినిమాలో అనసూయ ఎలాంటి పాత్రను పోషించలేదు కానీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో పాత్ర పోషించడంతో ఈ ఈవెంట్‌కు పిలిచారు. బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అనసూయ స్టేజి పైనే డైరెక్టర్ ని నన్నెందుకు ఈ సినిమాలో తీసుకోలేదని అడిగింది.

 

అనసూయ మాట్లాడుతూ.. ”బంగార్రాజు సినిమాలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు? నన్ను ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు అందరి ముందు చెప్పాలి” అని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణని అడిగింది. కళ్యాణ్ కృష్ణ దీనిపై స్పందిస్తూ.. ”చిన్న బంగార్రాజుకు పిన్ని పాత్ర అవుతుంది. ఏజ్ ఎక్కువగా చూపించాల్సి వస్తుంది. మరి అలాంటి పాత్ర చేస్తారా?” అని కళ్యాణ్ కృష్ణ అడిగాడు. అయితే నాకు మాత్రం కళ్యాణ్ కృష్ణ వేరే కారణం చెప్పాడని ”ముసలి పాత్రలు ఎందుకులే.. నీ కోసం సపరేట్‌గా బుజ్జి అనే వెబ్ సిరీస్ చేద్దామని” చెప్పాడని అనసూయ స్టేజి మీద చెప్పింది.

Raviteja : మెగాస్టార్ అతిధిగా రవితేజ ‘రావణాసుర’ పూజా కార్యక్రమం

ఈ సినిమాలోకి తీసుకోనందుకు ఏడవలేక ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాను. ఈ సినిమాలో నన్ను ఎందుకు పెట్టుకోలేదు అని బాధపడుతున్నాను. నాగ్ సర్, నాగ చైతన్య ఇలా ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం చాలా బాగుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.