Anasuya : విజయ్ దేవరకొండకు తెలీకుండానే జరుగుతుందా? డబ్బులిచ్చి మరీ నాపై నెగిటివ్ ట్రోల్స్ చేయిస్తున్నారు.. అనసూయ సంచలన వ్యాఖ్యలు..
అనసూయ మాత్రం అప్పుడప్పుడు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండ మీద కామెంట్స్, సైటైర్లు వేస్తోంది. దీంతో విజయ్ అభిమానులు ఫైర్ అయి అనసూయపై ట్రోలింగ్ చేస్తారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ విజయ్ దేవరకొండతో ఉన్న వివాదంపై స్పందించింది.

Anasuya says want to stop issue with Vijay devarakonda and comment they paid for negative trolls on her
Vijay Devarakonda : అనసూయ(Anasuya), విజయ్ దేవరకొండ మధ్య అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా నుంచి వివాదం కొనసాగుతోంది. విజయ్ ఎప్పుడూ అనసూయ గురించి మాట్లాడకపోయినా అనసూయ మాత్రం అప్పుడప్పుడు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండ మీద కామెంట్స్, సైటైర్లు వేస్తోంది. వీటితో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. దీంతో విజయ్ అభిమానులు ఫైర్ అయి అనసూయపై ట్రోలింగ్ చేస్తారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతూనే ఉంది.
ఇటీవల కూడా ఓ విషయంలో అసలు సంబంధమే లేకుండా విజయ్ దేవరకొండని ఇండైరెక్ట్ గా ట్విట్టర్ లో కామెంట్ చేయడంతో ఈ సారి అభిమానులు మాత్రమే కాక సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా అనసూయని ట్రోల్ చేశారు. స్టార్ డైరెక్టర్స్, హీరోయిన్స్ కూడా ఈ విషయంలో విజయ్ దేవరకొండకు మద్దతుగా పోస్టులు పెట్టారు. దీంతో అనసూయకు ఏం చేయాలో తెలియలేదు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ విజయ్ దేవరకొండతో ఉన్న వివాదంపై స్పందించింది.
అనసూయ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో నాకు ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉంది. ఆయన హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో అభ్యంతకర పదాలు ఉన్నాయి. వాటిని నేను వ్యతిరేకించాను. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆడియన్స్ తో కూడా ఆ పదాలను విజయ్ చెప్పించాడు. ఇలాంటివి ప్రోత్సహించొద్దని పర్సనల్ గా, పబ్లిక్ గా పలు ఇంటర్వ్యూలలో చెప్పాను. దీంతో నాపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ ట్రోల్స్ ని నేను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాలో కూడా నటించాను. విజయ్ కి చెందిన ఓ వ్యక్తి నన్ను ట్రోల్ చేయడానికి, నాపై నెగిటివ్ ట్రోల్స్ వేయడానికి డబ్బులిచ్చి మరీ చేయిస్తున్నాడని తెలిసింది. ఇదంతా విజయ్ కి తెలియకుండానే జరుగుతుందా? విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో, లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఇక్కడితో దీన్ని ఆపేయాలని కోరుకుంటున్నాను. ఇది వదిలేసి మానసికంగా ప్రశాంతంగా బతకాలని అనుకుంటున్నాను అని కామెంట్స్ చేసింది.
దీంతో అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా అనసూయ – విజయ్ దేవరకొండ వివాదానికి ముగింపు పడుతుందా? లేక ఈ వ్యాఖ్యలతో మరింత ముదురుతుందా చూడాలి.