Anasuya : నేను పిరికిదాన్ని కాదు.. నేనేంటో చూపిస్తా.. అనసూయ వార్నింగ్ విజయ్ దేవరకొండకేనా?
ఇటీవల ఎలాంటి సంఘటన, ఎలాంటి సంబంధం లేకుండానే విజయ్ దేవరకొండని(Vijay Devarakonda) టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నెటిజన్లు అనసూయని ఆడేసుకున్నారు.

Anasuya warning to vijay Deverakonda post goes viral
Vijay Deverakonda : సోషల్ మీడియాలో అనసూయ(Anasuya) చేసే హడావిడి అందరికి తెలిసిందే. సడెన్ గా ఏదో ఒక ట్వీట్ వేయడం, దానికి నెటిజన్లు రియాక్ట్ అవ్వడం, మళ్ళీ తనని ట్రోల్ చేస్తున్నారని అనసూయ ఫైర్ అవ్వడం గత కొన్నాళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం అనసూయని(Anasuya) ఆంటీ అన్నారని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో, కామెంట్స్ తో సినిమాలు, షోల కంటే కూడా ఈ మధ్య సోషల్ మీడియాలోనే(Social Media) బాగా హైలెట్ అవుతుంది అనసూయ.
ఇటీవల ఎలాంటి సంఘటన, ఎలాంటి సంబంధం లేకుండానే విజయ్ దేవరకొండని(Vijay Devarakonda) టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నెటిజన్లు అనసూయని ఆడేసుకున్నారు. విజయదేవరకొండ పేరు ముందు ‘The’ అని పెట్టుకున్నాడని విమర్శిస్తూ ఇండైరెక్ట్ గా ట్వీట్ చేయడంతో నెటిజన్లు, విజయ్ అభిమానులు అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో అనసూయ ఇంకో ట్వీట్ చేసి మరింత రెచ్చగొట్టింది. ఈ సారి పలువురు సెలబ్రిటీలు కూడా విజయ్ కి సపోర్ట్ గా ట్వీట్స్, ప్రమోషన్స్ చేశారు. దీంతో అనసూయకు ఏం చేయాలో తెలియక విజయ్ అభిమానులు, మీడియా మీద ఫైర్ అవుతూ ఓ వీడియో చేసింది.
ఇక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘంగా దీనిపై ఓ పోస్ట్ పెట్టింది అనసూయ. ఈ పోస్ట్ లో.. నువ్వు ఎవరో నీకు తెలుసు, నీ తప్పు నువ్వు తెలుసుకునే వరకు నేను ఇలాగే చేస్తుంటాను. నా విషయంలో ఏదైతే చేసావో దాన్ని నీకు ప్రతిసారి గుర్తుచేస్తూనే ఉంటాను. దీనివల్ల నాకు బాగా నెగిటివిటీ వస్తుంది అని తెలుసు. అయినా నిజం, మంచితనం, భగవంతుడిపై నాకు నమ్మకం ఉంది. ఏడ్చి సానుభూతి పొందే వ్యక్తిని కాదు. నన్ను ఎంత కిందకు లాగినా, నా మీద ఎంత బురద చల్లినా ఇలాగే ఫైట్ చేస్తుంటాను. వీటన్నిటికీ అర్ధం చెప్పే ఒక రోజు వస్తుందని నమ్ముతున్నాను. నాకు పని లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నాను అనుకోకండి. ఇది కూడా నా భాద్యత. నువ్వు నాలోని ఓ తల్లిని టార్గెట్ చేశావు. ఆ తల్లి ఎంత ధైర్యవంతులో నీకు చూపిస్తా అని పోస్ట్ చేసింది.
దీంతో ఈ వార్నింగ్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ, అతని ఫ్యాన్స్ కి అని అంతా భావిస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో మరోసారి పలువురు నెటిజన్లు అనసూయను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ గొడవ ఎప్పుడు ఆపుతుందో చూడాలి.