మహేష్ బాబు వల్ల ఈ పాట గురించి ప్రపంచానికి తెలిసింది – యాంకర్ ప్రదీప్

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చెయ్యడం వల్ల ‘నీలి నీలి ఆకాశం’ ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకూ వెళ్లింది – ప్రదీప్ మాచిరాజు..

మహేష్ బాబు వల్ల ఈ పాట గురించి ప్రపంచానికి తెలిసింది – యాంకర్ ప్రదీప్

Pradeep Anchor

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చెయ్యడం వల్ల ‘నీలి నీలి ఆకాశం’ ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకూ వెళ్లింది – ప్రదీప్ మాచిరాజు..

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’.. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ కథానాయిక. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లను ఇటీవల రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ‘నీలి నీలి ఆకాశం’ అనే వీడియో సాంగ్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా మంచి స్పందన వస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చిన ఈ చిత్రంలోని  ‘నీలి నీలి ఆకాశం’ సెన్సేషనల్ హిట్టయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పాట విజయోత్సవాన్ని బుధవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించారు.

ఈ సందర్భంగ్ నటుడు సమీర్ మాట్లాడుతూ : “చంద్రబోస్ మంచి ప్రేమికుడు కాబట్టే ఇంత బాగా పాటను రాయగలిగారని అనుకుంటున్నా. ఈ సాంగ్ ఆల్రెడీ సెన్సేషనల్ హిట్టయింది. ఒక పాట సినిమాని ఏ హైట్స్‌కి తీసుకెళ్తుందో ఇటీవల ఒక సినిమా చూపించింది. అంతే హిట్ ఈ సినిమా కూడా కాబోతోంది. ఇంత మంచి సినిమాలో నాకొక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ మున్నాకు థాంక్స్” అన్నారు.
నటి హేమ మాట్లాడుతూ : “ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రదీప్ ఫ్యాన్స్‌కు థాంక్స్. వాళ్లలో 90 శాతం లేడీ ఫ్యాన్సే. సీన్స్‌లో నటించేప్పుడు ఏదో అనుకున్నాను కానీ, డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం కళ్లవెంట నీళ్లొచ్చాయి. నా క్యారెక్టర్ చూసి నాకే ముద్దనిపించింది. కామెడీయే కాదు, సెంటిమెంట్ కూడా బాగా పండించగలనని నాక్కూడా తెలిసింది. ఇంత మంచి బ్యానర్లో, మంచి డైరెక్టరుతో పనిచేసినందుకు ఆనందంగా ఉంది” అని చెప్పారు.

neeli akasam

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ : “ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ మూవీకి వర్క్ చెయ్యడం నిజంగా మంచి ఎక్స్‌పీరియెన్స్. ఈ కథ మంచి మ్యూజిక్‌ను డిమాండ్ చేసింది. స్టోరీ విన్నప్పుడు ఏం ఫీలయ్యానో సినిమా చూశాక కూడా అదే ఫీలయ్యాను. ఇది మంచి విలువలున్న సినిమా. ఈ పాట ఇంత పెద్ద హిట్టవడానికి నా ట్యూన్స్‌తో పాటు చంద్రబోస్ గారిచ్చిన వండర్ఫుల్ లిరిక్స్. సిద్ శ్రీరాం, సునీత గారు తమ వాయిస్‌లతో పాటకు ప్రాణం పోశారు. స్క్రీన్ మీద ఆ పాటను శివేంద్ర అద్భుతంగా తన విజువల్స్‌తో తీసుకొస్తే, హీరో హీరోయిన్లు ప్రదీప్, అమృత గొప్పగా అభినయించారు. మొదట్నుంచీ ప్రొడ్యూసర్ ఎస్వీ బాబు గారిచ్చిన సపోర్ట్ మరవలేనిది” అని చెప్పారు.
గాయని సునీత మాట్లాడుతూ : “అనూప్ సంగీతం అందించిన, చంద్రబోస్ సాహిత్యం అందించిన ఎన్నో అద్భుతమైన పాటలు పాడాను. ‘నీలి నీలి ఆకాశం’ పాట అద్భుతాలు సృష్టించింది. ఈ పాటను పాడే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్” అన్నారు.

గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ : “ఒక పాటకు సంబంధించి విజయోత్సం జరగడం అన్నది నాకు తెలిసి ఇదే మొదటిసారి. ఇందులో నేను భాగస్వామినే కాకుండా, భావస్వామిని కూడా కావడం నాకు గర్వంగా ఉంది. అనూప్ కీబోర్డ్ ప్లేయర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా మారినప్పుడు, నాచేతే మొదటి పాట రాయించుకున్నారు. ‘నీలి నీలి ఆకాశం’ పాటను మెచ్చుకున్నవాళ్లలో దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, సంపత్ నంది, హను రాఘవపూడితో పాటు నా సహ రచయితలెందరో ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ‘మిత్రమా మీ కీర్తి కిరీటంలోని ఎన్నో కలికితురాళ్లలో ఇదొక కలికితురాయి’ అని ఆశీర్వదించారు. స్వచ్ఛత, పవిత్రత ఆ పాటలో ఉన్నాయి కాబట్టే ఇంతమంది మనసుల అభిమానాన్ని చూరగొంది. నాకు ‘రంగస్థలం’లోని ‘ఎంత సక్కగున్నావే’ పాట తర్వాత అన్ని అభినందనలు ఈ పాటకు లభిస్తున్నాయి” అన్నారు.

pradeep

హీరోయిన్ అమృతా అయ్యర్ మాట్లాడుతూ : “నిర్మాత బాబు గారు నన్ను కూతురిలా చూసుకున్నారు. డైరెక్టర్ మున్నా ఈ సినిమాలో నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఇది నా హృదయానికి బాగా దగ్గరైన మూవీ. కథ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. ఈ పాటను ఫస్ట్ విన్నప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్ చాలా ఇంటెన్స్ ఉంది. ప్రదీప్ చాలా మంచి సహనటుడు” అన్నారు.
నిర్మాత ఎస్వీ బాబు మాట్లాడుతూ : “నిజంగా ఇంత అద్భుతంగా ఈ సాంగ్ వస్తుందని నేను ఊహించలేదు. లిరిక్స్ విన్నప్పుడు చాలా బాగున్నాయని చెప్పాను. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ పాటను అద్భుతంగా చిత్రించిన సినిమాటోగ్రాఫర్ శివేంద్ర, పాటలో చాలా చక్కగా నటించిన హీరో హీరోయిన్లు, ఆ పాటను అలా తీసిన దర్శకుడికి థాంక్స్. కన్నడంలో నాతో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. వాటిలో చాలా పాటలకు అ వార్డులు కూడా వచ్చాయి. వాటన్నింటినీ మించి ఈ పాట ఉంది. అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్‌కు, అంత మంచి లిరిక్స్ ఇచ్చిన చంద్ర బోస్ గారికి థాంక్స్” అని చెప్పారు.

డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ : “నేను సుకుమార్ దగ్గర పనిచేశాను. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేసిన రానా గారికి థాంక్స్. ఇవాళ ‘నీలి నీలి ఆకాశం’ పాటకు ఇంతమంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను మొదట చూసిన ప్రేక్షకుడు సూపర్ స్టార్ మహేశ్ గారు. ఇప్పటి ప్రేక్షకుల స్పందన మొత్తాన్ని ఆరోజు ఆయన ముఖంలో చూశాం. ఈ పాటను పల్లెటూళ్ల దగ్గర్నుంచి సోషల్ మీడియా దాకా అందరూ పాడుతున్నారు. ఈ సినిమాని మ్యూజికల్‌గా చెప్పాలని అనుకున్నప్పుడు అనూప్ రూబెన్స్ తప్ప నాకు ఇంకో ఆప్షన్ కనిపించలేదు. రీ రికార్డింగ్‌తో ఈ సినిమా చూసినరోజు నా మనసంతా బరువెక్కిపోయింది. ప్రేక్షకులు రీ రికార్డింగ్‌ను కూడా పాడుకుంటారు. అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు అనూప్. చంద్రబోస్ గారు గొప్ప సాహిత్యం ఇచ్చారు. సమవుజ్జీలుగా ఉన్న సంగీత సాహిత్యాలకు తగ్గట్లు సిద్ శ్రీరామ్, సునీత తమ గాత్రాలతో పాటకు ప్రాణం పోశారు. ఆ పాటకు తెరపై ప్రదీప్, అమృత అభినయించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏది కావాలంటే దాన్ని నిర్మాత ఎస్వీ బాబు సమకూర్చిపెట్టారు. ఆయనకు ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే” అని చెప్పారు.

హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ : “మా యూనిట్ అందరి ముఖాలపై నవ్వు కనిపిస్తుండటానికి కారణం ఒక మంచి సినిమా చేశామనే నమ్మకం. తెలుగు ప్రేక్షకులెప్పుడూ మంచి సినిమాల్ని ఆదరిస్తారనేది మా నమ్మకం. ఈ సినిమా డైరెక్టర్ మున్నా అసలు పేరు ప్రదీప్. అంటే ఈ సినిమాకి ఇద్దరు ప్రదీప్‌లు కలిసి పనిచేశారు. ఒక బేబీలాగా ఆయన ఈ కథను పెంచారు. దాన్ని అద్భుతంగా మన ముందుకు తీసుకు వచ్చారు. ఒక ఇంటిపెద్ద లాగా, ఒక తండ్రిలాగా నిర్మాత ఎస్వీ బాబు గారు మమ్మల్ని ముందుకు నడిపించారు. మనస్ఫూర్తిగా చెబుతున్నా, ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది నాకు. ఆయన వండర్ఫుల్ పర్సన్. కథకు తగ్గట్లు ఖర్చుపెట్టి ఈ సినిమా నిర్మించారు. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టరుకూ ఇంపార్టెన్స్ ఉంటుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాల్లో ‘మనం’ నా ఆల్ టైం ఫేవరేట్.

అలాగే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘టెంపర్’ సాంగ్స్ కూడా చాలా ఇష్టం. అలాంటి అనూప్ నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం నేను ఊహించలేదు. లెజెండరీ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ‘నీలి నీలి ఆకాశం’ పాటను రాసిన విధానం అద్భుతం. అది ఆయన పెన్నులోని మ్యాజిక్ కాదు, ఆయన మనసులోని మ్యాజిక్. ఆ పాటను సిద్ శ్రీరామ్, సునీత అద్భుతంగా పాడారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్ టాక్.. ఇలా ప్రతిచోటా ఈ సాంగ్ సెన్సేషనల్ అవడం హ్యాపీ. ఒక్క టిక్ టాక్‌లోనే ఈ పాటపై ఒక లక్ష వీడియోస్ పైగా వచ్చి ట్రెండింగ్ అవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన రానా అన్నకు థాంక్స్. ఈ సాంగ్ వీడియో చూసి, అద్భుతంగా ఉందని మెచ్చుకొని, తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో లాంచ్ చేసిన మా సూపర్ స్టార్ మహేశ్ గారికి స్పెషల్ థాంక్స్.

ఇంతకంటే బిగ్గెస్ట్ లాంచ్ నా లైఫ్‌లో మళ్లీ రాదనుకుంటా. ఆయన లాంచ్ చెయ్యడం వల్ల ప్రపంచంలోని తెలుగువాళ్లందరి దగ్గరకు ఈ సాంగ్ వెళ్లింది. ఎస్వీ బాబు గారి తరపున ఆయన కుమారుడు వినయ్ బాబు మాతో కో-ఆర్డినేట్ చేస్తూ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ వచ్చారు. త్వరలో ఆయన ఎన్నో మంచి సినిమాల్ని నిర్మిస్తాడని ఆశిస్తున్నా. ‘నీలి నీలి ఆకాశం’ పాటను సగం రాజమండ్రిలో, సగం కేరళలో షూట్ చేశాం. అమృతా అయ్యర్ అద్భుతమైన సహనటి. నా మొదటి సినిమాలో ఇంత వండర్ఫుల్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నటించడం నా అదృష్టం. అతి త్వరలోనే ఈ సినిమాని అందరి ముందుకు తీసుకు వస్తాం” అని చెప్పారు.
ఈ కార్యక్రమలో నటుడు భద్రం, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నరేష్ బాబు కూడా మాట్లాడారు..