పోతావురరేయ్.. పోతావ్.. రోడ్ల మీద ఏం పని – వీడియో విడుదల చేసిన సుమ

కరోనా ఎఫెక్ట్ : లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యవాలని యాంకర్ సుమ సూచించారు..

  • Published By: sekhar ,Published On : March 24, 2020 / 08:46 AM IST
పోతావురరేయ్.. పోతావ్.. రోడ్ల మీద ఏం పని – వీడియో విడుదల చేసిన సుమ

కరోనా ఎఫెక్ట్ : లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యవాలని యాంకర్ సుమ సూచించారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించి నిత్యావసర వస్తువుల కోసం తప్ప ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరికలు జారీ చేసినా లెక్క చేయకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై ప్రముఖ యాంకర్ సుమ విరుచుకు పడ్డారు. గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలుపుతూ ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’తో పాటు, ‘జనతా కర్ఫ్యూ’కి భారీ ఎత్తున మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో సుమ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘గవర్నమెంట్స్ ఆర్డర్స్‌ని పాటిస్తూ మీలాగా, నాలాగా చాలామంది బాధ్యతాయుతంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది మాత్రం బాధ్యతారహితంగా ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఏమంత అర్జెంట్ పని.. రోడ్ల మీదకు వెళ్ళడానికి.. పోతావురరేయ్.. పోతావ్.. అని డిక్లేర్ చేస్తూన్నే ఉన్నారా..

గవర్నమెంట్ అఫీషియల్స్, హెల్త్ వర్కర్స్, కమ్యూనిటీ వర్కర్స్, డాక్టర్లు, నర్సులు, పోలీసు, మీడియా వీళ్లంతా వాళ్ల ప్రాణాల్ని రిస్కులో పెట్టి వర్క్ చేస్తున్నారు. ఇలాంటి పనులలో లేని వాళ్లు ఇళ్లకి పరిమితం అవొచ్చుకదా.. అలాగే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా వాళ్లని వాళ్లు డిక్లేర్ చేసుకోకుండా ఇళ్ళకి పరిమితమైన వాళ్లు ఇప్పటికైనా మీ గురించి డిక్లేర్ చేసినట్టైతే.. అది మీరు మన భారతదేశానికి చేసే చాలా పెద్ద ఉపకారం అవుతుంది. కరోనా వ్యాపించకుండా ఉంటుంది. Please stay at Home.. stay safe’’.. అంటూ వీడియోలో పేర్కొన్నారు సుమ..