Andrea Jeremiah: పిశాచి కోసం బోల్డ్ పాత్రలో ఆండ్రియా!

పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు కూడా సిద్దమే అని కొందరు హీరోయిన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. అయితే.. అందరికీ అలాంటి పాత్రలు రావు. వచ్చినా కొందరు అలాంటి సీన్లను సిద్ధంగా ఉండరు. అయితే.. సినిమాకు అలాంటి సీన్ ఖచ్చితంగా అవసరమని భావిస్తే కొందరు ఏ మాత్రం వెనకాడడం లేదు.

Andrea Jeremiah: పిశాచి కోసం బోల్డ్ పాత్రలో ఆండ్రియా!

Andrea In A Bold Role For The Pisasu 2 Tamil Movie

Andrea Jeremiah: పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు కూడా సిద్దమే అని కొందరు హీరోయిన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంటారు. అయితే.. అందరికీ అలాంటి పాత్రలు రావు. వచ్చినా కొందరు అలాంటి సీన్లను సిద్ధంగా ఉండరు. అయితే.. సినిమాకు అలాంటి సీన్ ఖచ్చితంగా అవసరమని భావిస్తే కొందరు ఏ మాత్రం వెనకాడడం లేదు. ఆ మధ్య ‘ఆడై’ సినిమా కోసం అమలాపాల్ నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే కాగా అది తెలుగులో ఆమె పేరుతో డబ్బింగ్ చేయగా ఇక్కడా సక్సెస్ సాధించింది.

కాగా, ఇప్పుడు ఆండ్రియా జెరెమియా కూడా అలాంటి పాత్రకు ఒకే చెప్పిందట. మిష్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన 2016లో ‘పిశాసు’ సినిమా తమిళంతో తెలుగులో కూడా పిశాచి పేరుతో మంచి విజయాన్ని అందుకుంది. రెండేళ్ల క్రితమే ఈ మూవీకి సీక్వల్‌గా‌ ‘పిశాసు-2’ రాబోతోందని మిష్కిన్ ప్రకటించాడు. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుకాగా కరోనాతో బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టారు.

అయితే, కథ డిమాండ్‌ చేయడంతో ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కొందరి సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోండగా ఈ విషయమై కోలీవుడ్‌లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో ఆండ్రియాతో పాటు పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలు పెంచగా ట్రైలర్ ఎలా ఉండనుందోనని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.