Anee Master : అనీ మాస్టర్‌కు కరోనా.. రెండో సారి.. కరెక్ట్‌గా వన్ ఇయర్ గ్యాప్‌తో

తాజాగా కొరియోగ్రాఫ‌ర్‌, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అనీ మాస్ట‌ర్ క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. అయితే అనీ మాస్టర్ కు గతేడాది కూడా కరోనా సోకింది.

Anee Master :  అనీ మాస్టర్‌కు కరోనా.. రెండో సారి.. కరెక్ట్‌గా వన్ ఇయర్ గ్యాప్‌తో

Ani Master

Anee Master :  ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళ స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. కొంతమందికి గతంలో కరోనా సోకినా మళ్ళీ కరోనా వస్తుంది. ఇలా రెండో సారి కూడా కరోనా సోకిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.

తాజాగా కొరియోగ్రాఫ‌ర్‌, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అనీ మాస్ట‌ర్ క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. అయితే అనీ మాస్టర్ కు గతేడాది కూడా కరోనా సోకింది. ఇదే విషయాన్ని వెల్లడించింది. ‘గ‌తేడాది కూడా నాకు కోవిడ్ వ‌చ్చింది. కరోనా వచ్చిన 24 రోజుల త‌ర్వాత 2021 జ‌న‌వ‌రి 23న నాకు క‌రోనా త‌గ్గిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు 2022 జ‌న‌వ‌రి 23న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ కరోనా నా లాగా టైం మెయింటెన్ చేస్తుంది. క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది’ అని అనీ మాస్టర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

Lahari Shari : ఖరీదైన BMW బైక్ కొనుగోలు చేసిన బిగ్‌బాస్ భామ

అయితే కరోనా వచ్చిన తర్వాత రెండు రోజులకి అనీ మాస్టర్ ఈ విషయాన్ని తెలిపింది. కరెక్ట్ గా వన్ ఇయర్ గ్యాప్ తో కరోనా వచ్చిందని చెప్తుంది. ప్రస్తుతం అనీ మాస్టర్ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంది. అనీ మాస్టర్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.