F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎఫ్3’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్,...

F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి

Anil Ravipudi About Heroes In F3 Movie

Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎఫ్3’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో ఈ మూవీ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు దగ్గరపడటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!

తాజాగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో హీరోలకు ఉండే లోపాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌కు రేచీకటి ఉండటం.. వరుణ్ తేజ్‌కు నత్తి ఉండటంతో వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని.. వారిద్దరు కలిసి చేసే అయోమయం కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అనిల్ రావిపూడి తెలిపారు.

F3: ఎఫ్3 సెన్సార్ రిపోర్ట్.. సమ్మర్‌లో చిల్ కావడం ఖాయం!

ఇక ఈ సినిమాలో హీరోయిన్లు కూడా తమ కామెడీతో ఆడియెన్స్‌ను అరిపించేస్తారని.. ప్రేక్షకులు ఈ సినిమాలోని కామెడీని పూర్తిగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఇక మే 27న థియేటర్లలో నవ్వుల పువ్వులు పూస్తాయని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎఫ్3 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి.