Sudigadu 2 : అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సుడిగాడు 2’.. అల్లరి నరేష్ బ్యాక్ టు కామెడీ?

అల్లరి నరేష్ కెరీర్ లో చాలా కామెడీ సినిమాలు సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కానీ ఒకానొక సమయంలో ఆయన చేస్తున్న కామెడీ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి సీరియస్, ఎమోషనల్, మాస్ సినిమాలు చేద్దామని ఫిక్స్ అయ్యాడు.

Sudigadu 2 : అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సుడిగాడు 2’.. అల్లరి నరేష్ బ్యాక్ టు కామెడీ?

Anil Ravipudi Planing Sudigadu 2 Movie with Allari Naresh

Sudigadu 2 :  అల్లరి నరేష్(Allari Naresh).. ఒకప్పుడు తన అల్లరి సినిమాలతో ప్రేక్షకులని కితకితలు పెట్టించాడు. తన సుడిగాలి లాంటి కామెడీతో(Comedy) ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. దాదాపు 50 సినిమాలు కామెడీ సినిమాలే చేశాడు అంటే టాలీవుడ్(Tollywood) కి ఎంత వినోదాన్ని ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. అల్లరి నరేష్ కెరీర్ లో చాలా కామెడీ సినిమాలు సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కానీ ఒకానొక సమయంలో ఆయన చేస్తున్న కామెడీ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఆలోచనలో పడ్డాడు.

కొన్నాళ్ళు కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి సీరియస్, ఎమోషనల్, మాస్ సినిమాలు చేద్దామని ఫిక్స్ అయ్యాడు అల్లరి నరేష్. కామెడీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత వచ్చిన మొదటి సినిమా నాంది భారీ విజయం సాధించింది. ఇందులో అల్లరి నరేష్ ఎమోషనల్ గా మెప్పించాడు. ఆ తరవాత వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఫుల్ మాస్, పవర్ ఫుల్, యాక్షన్ రోల్ లో ఉగ్రం సినిమాతో రావోతున్నాడు. ఉగ్రం సినిమా మే 5న రిలీజ్ కానుంది.

దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా అల్లరి నరేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా సినిమాల్లో సుడిగాడు సినిమాకు సీక్వెల్ తీయొచ్చు. ఆ సినిమాకు పనిచేసిన అనిల్ రావిపూడిని ఇటీవల కలిశాను. అతనే సుడిగాడు 2 తీద్దామా అని అడిగాడు. నేను రూటు మార్చితే మళ్ళీ కామెడీ వైపు తీసుకెళ్తారా అని అడిగితే ఆయన ఓకే అన్నాడు అని తెలిపారు. దీంతో అనిల్ రావిపూడి డైరెక్షన్లో నిజంగానే సుడిగాడు 2 ఉంటుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. నరేష్ ఇప్పట్లో ఈ సీరియస్ ఇంటెన్స్ సినిమాలు వదిలి వచ్చేలా లేడు, మరి వీరిద్దరి కాంబోలో సుడిగాడు 2 సినిమా ఎప్పుడు వస్తాడో చూడాలి.

Allari Naresh : కామెడీ చేసేవాళ్ళంటే ఇండస్ట్రీలో చిన్న చూపు ఉంది.. అల్లరి నరేష్ సంచలన వ్యాఖ్యలు..

అల్లరి నరేష్ నటించిన సుడిగాడు సినిమా 2012 లో రిలీజయి భారీ విజయం సాధించింది. మొత్తం స్పూఫ్, కామెడీ సన్నివేశాలతోనే భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి రచయితల్లో ఒకరిగా పనిచేశాడు. అప్పట్లోనే ఆ సినిమా 7 కోట్లు పెట్టి తీస్తే 32 కోట్లు వసూలు చేసింది.