Anil Ravipudi : ఏపీ థియేటర్స్ విషయంలో అయోమయంగా ఉంది..

‘ఏపీలో థియేటర్స్ విషయంలో జరుగుతున్న పరిణామాలు ఎవరికీ అర్థం కాని విధంగా ఉన్నాయి - అనిల్ రావిపూడి..

Anil Ravipudi: సినిమా పరిశ్రమకు చుక్కలు చూపిస్తోంది ఏపీ ప్రభుత్వం. పాండమిక్ వల్ల సినిమా పరిశ్రమతో పాటు థియేటర్ల ఓనర్స్, పనిచేసే సిబ్బంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి.. మరి కొద్ది రోజుల్లో సినీ ఇండస్ట్రీ మంచి రోజులు రాబోతున్నాయి అని సంబరపడుతున్న మేకర్స్‌కు గట్టి షాక్ తగిలింది.

Siddharth : దోచుకుంటోంది రాజకీయ నేతలే..! ముందు మీ అవినీతి తగ్గించుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించని విధంగా టికెట్ రేట్లు తగ్గించడంతో పాటు బెన్‌ఫిట్ షోలకు, ఎలాంటి స్పెషల్ షోలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పడంతో కొత్త సినిమాల విడుదల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది.. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సీజన్‌లో పెద్ద మొత్తంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆశించిన నిర్మాతలు, థియేటర్ల యజమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ విషయంలో ఎలా స్పందించాలో.. అసలు స్పందిస్తే ఏం జరుగుతుందోననే అయోమయంలో ఉన్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.

Vijay Deverakonda : తెలంగాణ సర్కార్ ఇండస్ట్రీ బాగును కోరుకుంటోంది..

రీసెంట్‌గా ఈ అంశంపై బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రెస్పాండ్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీలో థియేటర్స్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై కొంత అయోమయంగా ఉంది. ఎవరికీ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

RRR Movie : మళ్లీ వాయిదా?

ట్రెండింగ్ వార్తలు