Hero : మహేష్ మేనల్లుడి కోసం నటుడిగా మారిన అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు హీరోగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరో ఓ డైరెక్టర్ వద్దకి ఛాన్సుల కోసం వెళ్తాడు. ఆ డైరెక్టర్.........

10TV Telugu News

Anil Ravipudi :  సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా జనవరి 15 సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మంది వచ్చారు. అందులో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరు.

వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ”ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు హీరోగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరో ఓ డైరెక్టర్ వద్దకి ఛాన్సుల కోసం వెళ్తాడు. ఆ డైరెక్టర్ పాత్రని నన్నే పోషించమని నా ఫ్రెండ్, ఈ సినిమా డైరెక్టర్ శ్రీరామ్ అడిగాడు. ‘హీరో’ సినిమాలో నేను అనిల్ రావిపూడి పాత్రలోనే కనిపిస్తాను. హీరో చాన్సుల కోసం తన వద్దకు వస్తాడని, ఆ సీన్ చాలా బాగా వచ్చిందని” చెప్పారు.

Anasuya : ‘బంగార్రాజు’లో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు.. స్టేజి పైనే డైరెక్టర్‌ని అడిగేసిన అనసూయ

దీంతో అనిల్ రావిపూడి మరోసారి తెరపై కనిపించబోతున్నారు. గతంలో ‘ఎఫ్2’ సినిమాలో కూడా క్లైమాక్స్ లో అనిల్ రావిపూడి కనిపిస్తారు. ఇప్పుడు మరోసారి ‘హీరో’ సినిమాలో కనిపించబోతున్నారు. తన ఫ్రెండ్, సినిమా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కోసమే ఈ పాత్ర చేస్తున్నట్టు అనిల్ తెలిపాడు.

×