Anirudh : తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సారైనా దక్కేనా..

తమిళ్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ హీరోలు ఏరి కోరి మరి అనిరుధ్ మాత్రమే కావాలంటున్నారు. అక్కడ అనిరుధ్ సక్సెస్ చూసి మన హీరోలు కూడా

Anirudh : తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సారైనా దక్కేనా..

Anirudh

Anirudh :   సినిమా కంటే ముందే ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసేది మ్యూజిక్. మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అయితేనే సినిమా మీద బజ్, హైప్ ఎక్కువగా ఉంటుంది. ఇలా హైప్ క్రియేట్ చెయ్యడంలో నంబర్ వన్ అనిరుద్. తమిళ్ లో అన్ స్టాపబుల్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి తెలుగులో మాత్రం అంత హిట్ ట్రాక్ లేదు. అయితే తమిళ్ లోలానే తెలుగులో కూడా తన సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చెయ్యడానికి ఈ సారి వచ్చిన ఛాన్సులని వదులుకోకూడదు అనుకుంటున్నాడు.

తమిళ్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ హీరోలు ఏరి కోరి మరి అనిరుధ్ మాత్రమే కావాలంటున్నారు. అక్కడ అనిరుధ్ సక్సెస్ చూసి మన హీరోలు కూడా అనిరుధ్ మీద మనసు పారేసుకున్నారు. సరే కదా అని ఛాన్స్ ఇస్తే అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి సినిమాలు చేసినా ఫర్వాలేదనిపించాడు కానీ సాలిడ్ మ్యూజిక్ హిట్ మాత్రం అనిరుధ్ కి దక్కలేదు.

తమిళ్ తో పాటే తెలుగులో కూడా ఆ రేంజ్ చూపించాలనుకుంటోన్న అనిరుధ్ ఇప్పటినుంచే హోమ్ వర్క్ చేస్తున్నాడు. టాలీవుడ్ బిగ్ స్టార్స్ సినిమాల్లో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తూ, ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా షురూ చేయబోతున్నాడు. అతిత్వరలో సెట్స్ పైకెళ్లబోతున్న ఎన్టీఆర్ – కొరటాల శివ, రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి వంటి క్రేజీ కాంబోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు అనిరుధ్.

Divyabharathi : మరోసారి బిగుతైన దుస్తుల్లో మత్తెక్కించే చూపులతో దివ్యభారతి

RRR తర్వాత వచ్చే సినిమా, అది కూడా ఎన్టీఆర్ 30వ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్ కి కావల్సిన మాస్ సాంగ్స్ ని పెద్దగా టచ్ చెయ్యని అనిరుధ్ తారక్ సాంగ్స్ అంటే ఖచ్చితంగా మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేయాలన్న ఆలోచన వస్తే క్లిక్ అవ్వొచ్చు అంటున్నారు. అంతే కాక ఈ మూవీ రిజల్ట్ పైనే అనిరుధ్ టాలీవుడ్ కెరీర్ కూడా ఒకరకంగా డిపెండ్ అయి ఉందనే చెప్పొచ్చు. తమిళ్ లో ఎంత పెద్ద మ్యూజికల్ హిట్స్ ఉన్నా టాలీవుడ్ లో సరైన హిట్ పడితేనే తెలుగు హీరోల సినిమాల్లో నెక్ట్స్ అవకాశం వస్తుంది. మరి ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాన్స్ తో అనిరుధ్ ఫేట్ మారుతుందా లేదా అన్నది చూడాలి.