నిశ్శబ్దం : అంజలి లుక్ అదిరింది

‘నిశ్శబ్దం ’సినిమాలో అంజలి పవర్‌ఫుల్‌ క్రైమ్ డిటెక్టివ్‌ ఏజెంట్‌ ‘మహా’గా కనిపించనుంది..

  • Published By: sekhar ,Published On : November 1, 2019 / 08:22 AM IST
నిశ్శబ్దం : అంజలి లుక్ అదిరింది

‘నిశ్శబ్దం ’సినిమాలో అంజలి పవర్‌ఫుల్‌ క్రైమ్ డిటెక్టివ్‌ ఏజెంట్‌ ‘మహా’గా కనిపించనుంది..

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్నసినిమా ‘నిశ్శబ్దం’..  విలక్షణ నటుడు ఆర్.మాధవన్, అంజలి  షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ (‘కిల్ బిల్’ ఫేమ్) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన అనుష్క, మాధవన్ లుక్స్‌ అండ్ ప్రీ-టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు అంజలి క్యారెక్టర్‌ని రివీల్ చేశారు.. ఈ సినిమాలో అంజలి పవర్‌ఫుల్‌ క్రైమ్ డిటెక్టివ్‌ ఏజెంట్‌ ‘మహా’గా కనిపించనుంది.

Read Also : హిందీ ‘జెర్సీ’ : షాహిద్ ప్రీ-లుక్

అమెరికాలోని సియోటెల్‌ కేంద్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. నవంబర్ 7న అనుష్క బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు.. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో విడుదల కానుంది..