Annaatthe : టాక్ డిజాస్టర్.. అయినా డబుల్ సెంచరీ.. ఇదీ రజినీ స్టామినా..

పాండమిక్ తర్వాత సౌత్‌లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టింది రజినీ ‘అన్నాత్తే’ మూవీ మాత్రమే..

Annaatthe : టాక్ డిజాస్టర్.. అయినా డబుల్ సెంచరీ.. ఇదీ రజినీ స్టామినా..

Annaatthe 200 Crore Club

Annaatthe: సూపర్‌స్టార్ రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్ బరిలో సత్తా చాటారు. రజినీ – నయనతార నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’, దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న తెలుగు, తమిళ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేశారు.

Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..

ఇక్కడ పెద్దగా టాక్ లేదు కానీ తమిళనాట మాత్రం విపరీతంగా ఆడేస్తోంది ‘అన్నాత్తే’. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఫస్ట్ వీక్‌లో వరల్డ్ వైడ్‌గా 200 కోట్లు కొల్లగొట్టింది. టాక్‌తో సంబంధం లేకుండా తన స్టామినా చూపించారు రజినీ.

Naatu Naatu Song : గట్టు మీద గడ్డపారలు! ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా ఎన్టీఆర్ – చరణ్ డ్యాన్స్ !

‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘అన్నాత్తే’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, జగపతి బాబు నటించిన ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ప్రస్తుతం తమిళనాట విపత్కర పరిస్థితులు నెలకొన్నా కూడా ‘అన్నాత్తే’ మంచి కలెక్షన్లు రాబడుతోంది.

Anasuya Bharadwaj : ‘బంగారం’ సిస్టర్ అంటూ ట్రోల్స్..

ఇప్పటికే 100, 150 కోట్ల మార్క్ దాటేసి, ఏకంగా 200 కోట్లు కొల్లగొట్టింది. పాండమిక్ తర్వాత సౌత్‌లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టింది ‘అన్నాత్తే’ మాత్రమే. ఫస్ట్ వీక్ ‘అన్నాత్తే’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Day 1 – రూ. 70.19 కోట్లు
Day 2 – రూ. 42.63 కోట్లు
Day 3 – రూ. 33.71 కోట్లు
Day 4 – రూ. 28.20 కోట్లు
Day 5 – రూ. 11.85 కోట్లు
Day 6 – 9.50 కోట్లు
Day 7 – 6.39 కోట్లు
Total – రూ. 202.47 కోట్లు..

Naatu Naatu Song : థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.. 10టీవీతో రాహుల్ సిప్లిగంజ్..