Annaatthe : 200 కోట్ల దిశగా రజినీ సినిమా! ఇదీ సూపర్‌స్టార్‌ స్టామినా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ బాక్సాఫీస్ బరిలో సత్తా చూపిస్తోంది..

Annaatthe : 200 కోట్ల దిశగా రజినీ సినిమా! ఇదీ సూపర్‌స్టార్‌ స్టామినా..

Rajini

Annaatthe: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’, దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేశారు.

Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..

‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘అన్నాత్తే’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, జగపతి బాబు నటించిన ఈ సినిమా తమిళనాట సూపర్ హిట్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ప్రస్తుతం తమిళనాట విపత్కర పరిస్థితులు నెలకొన్నా కూడా ‘అన్నాత్తే’ మంచి కలెక్షన్లు రాబడుతోంది.

Naatu Naatu Song Promo : రామ్, భీమ్ ఆట – పాట.. తప్పదు రికార్డుల వేట..

ఇప్పటికే 150 కోట్ల మార్క్ దాటేసి, 185 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవబోతోంది. ఇప్పటివరకు ‘అన్నాత్తే’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Day 1 – రూ. 70.19 కోట్లు
Day 2 – రూ. 42.63 కోట్లు
Day 3 – రూ. 33.71 కోట్లు
Day 4 – రూ. 28.20 కోట్లు
Day 5 – రూ. 11.85 కోట్లు
Total – రూ. 186.58 కోట్లు..

Peddanna : బతికుంటే బాలునే పాడేవారు..