Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..

సూపర్‌స్టార్ రజినీకాంత్ కోసం గానగంధర్వుడు ఎస్పీ బాలు పాడిన చివరి సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది..

Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..

Spb

Annaatthe: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు టీమ్. ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న విడుదల కానుంది.

SP Balasubramanyam : ప్రధమ వర్థంతి సందర్భంగా.. బాలు జీవిత విశేషాలు..

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాట పాడడం విశేషం. రజినీ నటించిన పలు తమిళ్, తెలుగు సినిమాల్లో బాలు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. అలాగే ‘కథానాయకుడు’ సినిమాకు తెలుగులో రజినీకి డబ్బింగ్ చెప్పారు. ‘అన్నాత్తే’ టైటిల్ సాంగ్ తన స్టైల్లో ఎనర్జిటిక్‌గా పాడారు. ఎస్పీబీ పాడిన ‘అన్నాత్తే’ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందని చెబుతున్నారు మూవీ టీం.

SP Balasubrahmanyam : బాలును వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు..

లిరికల్ వీడియో బాలు నివాళితో స్టార్ట్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ ఈ సాంగ్ అప్పుడు బాలుతో తీసుకున్న ఫొటోకు ‘వుయ్ లవ్ యూ సార్’ అనే కొటేషన్ ఇస్తూ సాంగ్ ఎండ్ చేశారు. రజినీ సినిమా కోసం బాలు ఆలపించిన ఈపాట వింటూ అభిమానులు, సంగీత ప్రియులు భావోద్వేగానికి గురవుతున్నారు.

Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!

డి.ఇమాన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. వివేక లిరిక్స్ రాశారు. హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా సాగే ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటుంది. రజినీ సరికొత్త గెటప్‌లో కనిపించారు. దీపావళి కానుకగా తమిళ్, తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది ‘అన్నాత్తే’.