Peddanna : బతికుంటే బాలునే పాడేవారు..

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పెద్దన్న’ సినిమాలో బాలు తనయుడు ఎస్పీ చరణ్ పాడిన సాంగ్ ఆకట్టుకుంటోంది..

Peddanna : బతికుంటే బాలునే పాడేవారు..

Sp Charan

Peddanna: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రాబోతోంది. ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా 2021 నవంబర్ 4న తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.

Puneeth Rajkumar : బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగం..

శనివారం సాయంత్రం ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం‘అన్నాత్తే’ టైటిల్ సాంగ్ తన స్టైల్లో ఎనర్జిటిక్‌గా పాడారు. రజినీ కోసం బాలు పాడిన చివరి తమిళ్ సాంగ్ ఇదే. తెలుగు సాంగ్ బాలు తనయుడు ఎస్పీ చరణ్ పాడారు.

Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..

‘అన్నయ్యా అన్నయ్యా అని గుండెలోన పెట్టుకున్న అందరికి థ్యాంక్సు.. అన్నయ్య అన్నయ్య అని ప్రేమ నాకు పంచుతున్న మీకు నేను ఫ్యాన్సు’.. అంటూ సాగే ఈ పాటకు డి.ఇమాన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. తమిళ్‌లో తండ్రి పాడిన ‘అన్నాత్తే’ టైటిల్ సాంగ్‌ను తెలుగులో తనయుడు పాడడం విశేషం. బతికుంటే తెలుగులోనూ బాలునే పాడేవారంటూ సంగీతాభిమానలు భావోద్వేగానికి గురవుతున్నారు.