Pushpa: పుష్పపై మరో బజ్.. జతకానున్న మరో టాలెంటెడ్ బ్యూటీ

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఫారెస్ట్, స్మగ్లింగ్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కే పుష్ప నుండి ఇప్పటికే విడుదలైన ఫొటోలు, టీజర్లు, పాటపై..

Pushpa: పుష్పపై మరో బజ్.. జతకానున్న మరో టాలెంటెడ్ బ్యూటీ

Pushpa

Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఫారెస్ట్, స్మగ్లింగ్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కే పుష్ప నుండి ఇప్పటికే విడుదలైన ఫొటోలు, టీజర్లు, పాటపై అంచనాలు పెంచేశాడు సుక్కు. ప్రతి సినిమాను ఎంతో పద్ధతిగా తెరకెక్కించి హిట్ కొట్టే ఈ క్రీజీ డైరెక్టర్.. ఈ సినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాను రెండు భాగాలుగా మలచనున్నట్లు తెలిసిందే. కాగా, పాత్రలను కూడా అదే రేంజ్‌లో సెలెక్ట్ చేసుకుంటున్నారంట.

Deepika Padukone: చనిపోవాలనుకున్నా.. అంతలా నరకం అనుభవించా!

రెండు భాగాలు కోసం కథలో చేసిన మార్పుల దృష్ట్యా ఈ సినిమాలో కొత్త పాత్రలు కూడా తోడవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా ఓ గిరిజన యువతి పాత్రలో రష్మిక నటిస్తుండగా.. స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా మెరవనుంది. మరోవైపు మలయాళం నుండి స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ తో పాటు మరికొందరు నటులను కూడా ఈ సినిమాకి జత చేసిన సుకుమార్, తమిళం నుండి ఐశ్వర్య రాజేష్, తెలుగు నుండి అనసూయను మరోసారి కీలక పాత్ర కోసం తీసుకున్నాడు. ఇది చాలదని ఇప్పుడు మరో ట్యాలెంటెడ్ బ్యూటీని కూడా ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలుస్తుంది.

Drugs Case: నేడు ఈడీ విచారణకు నటుడు నవదీప్, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌!

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తమిళ టాలెంటెడ్ బ్యూటీ వర్ష బొల్లమ్మ నటించబోతుందని తెలుస్తోంది. ఆమెది బన్నీకి చెల్లిలి పాత్ర టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తపై ఇప్పటికి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ వర్ష పాత్రపై బజ్ నెలకొంది. వర్ష తమిళ, మలయాళ, కన్నడ సినిమాలతో పాటు తెలుగులో కూడా నటించింది. చూసి చూడంగానే, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన వర్ష జాను సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. కాగా, పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.