Bigg Boss 5 Telugu: ఫినాలేకి ముందే మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్.. నిజమా?

తెలుగు బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఫినాలే నడుస్తున్న ఈ షోలో ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉండగా ఈ వారంతో ఈ సీజన్ విన్నర్ ఎవరో..

Bigg Boss 5 Telugu: ఫినాలేకి ముందే మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్.. నిజమా?

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఫినాలే నడుస్తున్న ఈ షోలో ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉండగా ఈ వారంతో ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ బిగ్ అంమౌంట్ గెలుచుకొనే కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఇంట్లో మిగిలిన ఆ ఐదుగురిలోనే టైటిల్ విన్నర్ ఉండగా టైటిల్ పోరులో ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉంది. ఫినాలే మొదలవడంతో ఇక ఐదుగురిలో ఎలిమినేషన్స్ ఉండవు.

Sidhika Sharma: ఓరచూపులతో కైపెక్కిస్తున్న సిద్ధికా శర్మ!

కానీ.. అనూహ్యంగా బిగ్ బాస్ నిర్వాహకులు ఫినాలేకు ముందే మరో కంటెస్టెంట్ ను ఎలిమినేషన్ చేసేందుకు సిద్ధమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఫినాలే స్టేజ్‌పై కాకుండా ముందుగానే బిగ్‌బాస్‌ మరో కంటెస్టెంట్ ను ఇంటి నుండి బయటకి పంపేసినట్లుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది. అది కూడా సిరిని ఎలిమినేట్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిరి ఎలిమినేషన్ తర్వాత షణ్ముఖ్ ఎలా రియాక్ట్ అవుడతాడన్నది చూసేందుకే ఈ ఎలిమినేషన్ ప్లాన్ అని చెప్తున్నారు.

Radhe Shyam: జీవితానికి, చావుకు మధ్య పార్టీ జరిగితే.. రాధేశ్యామ్ సీక్రెట్స్ రివీల్!

అయితే.. ఈ ఎలిమినేషన్ నిజం కాదు. కాకపోతే ఓ గంట పాటు సిరిని సీక్రెట్‌ రూంలో ఉంచనున్నారట. అయితే, ఇది మిగిలిన నలుగురు కంటెస్టెంట్లకు ఎలిమినేషన్ అయినట్లే భావించగా షణ్ముఖ్ ఎలా ప్రవర్తిస్తాడన్నది ఎపిసోడ్ లో చూపించనున్నారు. సిరి మళ్ళీ హౌస్ లోకి వెళ్తే మిగిలిన నలుగురు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా, ప్రస్తుతం అఫీషియల్‌ పోలింగ్‌ ప్రకారం సన్నీ ముందంజలో ఉండగా, షణ్నూ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం సిరి, మానస్‌ల మధ్య పోటీ ఉందని తెలుస్తుంది.