Salman Khan: సల్మాన్ ఖాతాలో మరో భామ.. సమంతతో భాయ్ జాన్ డేటింగ్!

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ప్రేమ, గర్ల్ ఫ్రెండ్స్ వ్యవహారం మొదటి నుండి చెప్పుకోవాలంటే పెద్ద కథే అవుతుంది. ఐశ్వర్య రాయ్ నుండి కత్రినా వరకు చాలా పేర్లే..

Salman Khan: సల్మాన్ ఖాతాలో మరో భామ.. సమంతతో భాయ్ జాన్ డేటింగ్!

Salman Khan

Salman Khan: బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ప్రేమ, గర్ల్ ఫ్రెండ్స్ వ్యవహారం మొదటి నుండి చెప్పుకోవాలంటే పెద్ద కథే అవుతుంది. ఐశ్వర్య రాయ్ నుండి కత్రినా వరకు చాలా పేర్లే వినిపిస్తాయి. దాదాపు డజను మందితో ప్రేమ కథలు నడిపించిన భాయ్ జాన్ ఆరు పదుల వయసుకి దగ్గరవుతున్నా ఇంకా బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. కత్రినా కైఫ్ తో రిలేషన్ తర్వాత చాలా కాలంగా ఒంటరిగానే ఉన్నట్లు చెప్పుకున్న సల్మాన్ ఇప్పుడు మరో అమెరికా నటితో రిలేషన్ లో ఉన్నాడని ముంబై మీడియా కోడై కూస్తుంది.

Dil Raju: వారసుడి కోసం బార్డర్ దాటిన దిల్ రాజు అండ్ కో!

సల్మాన్ ఖాన్, అమెరికా నటి సమంత లాక్ వుడ్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. నూతన సంవత్సర వేడుకలకు రెండు రోజుల ముందు పాన్వెల్ లోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సల్మాన్ జన్మదిన వేడుకల్లోనూ ఆమె పాల్గొనడం ఊహాగానాలను మరింత పెంచింది. దీంతో ఎవరు ఈ హాట్ బ్యూటీ అంటూ ఆరాలు మొదలవగా.. భాయ్ ఖాతాలో మరో భామ అంటూ జాతీయ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం సాగుతోంది. సమంత వుడ్ తో సల్మాన్ సీరియస్ రిలేషన్ లో ఉన్నాడని కథలు కథలుగా చెప్పుకున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు నేరుగా సమంతనే అడిగేశారు.

Ram Charan: శ్యామ్ దర్శకుడితో చెర్రీ.. ఇది కూడా యూనివర్సల్ కాన్సెప్టే!

‘‘ప్రజలు చాలా మాట్లాడుతుంటారు. లేని దాని గురించి చాలానే చెప్పగలరు. నేను సల్మాన్ ఖాన్ ను కలుసుకున్నాను. ఆయన మంచి వ్యక్తి. చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. ప్రజలకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను కలవడం అంటే.. హృతిక్ రోషన్ ను కూడా కలుసుకున్నాను. కానీ, నా గురించి, హృతిక్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు’’ అని సమంత వుడ్ స్పష్టం చేసింది. మరి నిజంగానే అలాంటిదేమీ లేదా.. ఉన్నా అందరిలాగానే మేము ఫ్రెండ్స్ అంటున్నారో ఆ ఇద్దరికే తెలియాలి.