Kushi Movie: విజయ్ సమంతల మధ్యలో మరో హీరోయిన్.. నిజమేనా?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఖుషి’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Kushi Movie: విజయ్ సమంతల మధ్యలో మరో హీరోయిన్.. నిజమేనా?

Another Heroine In Vijay Devarakonda Samantha Kushi Movie

Kushi Movie: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఖుషి’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

Kushi 2023 : రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఖుషీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాలో విజయ్-సామ్‌ల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Kushi : విజయ్ అండ్ సమంత బ్యాక్ టు ‘ఖుషి’ సెట్స్.. శివ నిర్వాణ ట్వీట్!

ఈ సినిమాలో అందాల భామ దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఖుషిలో సమంత చెల్లి పాత్రలో దివ్యాంశ కనిపిస్తుందట. కాగా, ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోవడం గమనార్హం. అయితే, ఈ సినిమాతో శివ నిర్వాణ ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, సెప్టెంబర్ 1న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.