RC 15: చరణ్ సినిమాకి మరో అడ్డంకి.. శంక‌ర్ చుట్టూ ఎందుకీ వివాదాలు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా తండ్రి మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో..

RC 15: చరణ్ సినిమాకి మరో అడ్డంకి.. శంక‌ర్ చుట్టూ ఎందుకీ వివాదాలు?

Rc 15

RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా తండ్రి మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ తో కలిసి మరో క్రేజీ పాన్ ఇండియా సినిమాకు సిద్దమయ్యాడు. అయితే, ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రకటించడంతోనే భారీ క్రేజ్ తో పాటు వివాదాలు వరసపెట్టాయి.

శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా ప్రకటించగానే శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కోర్టుకెక్కింది. ఇండియన్ సినిమా పూర్తికాకుండా శంకర్ మరో సినిమాకు ఎలా వెళ్తాడని లైకా తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ వ్యవహారంలో వాదోపవాదనలు అలా ఉండగానే ఇప్పుడు చరణ్ సినిమా మరో వివాదంలో పడింది. చెల్లముత్తు అనే రచయిత ఈ సినిమా కథ తనదంటూ దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. నిజానికి ఈ సినిమాకు జిగర్తాండా, పెట్ట, జగమే తంతిరం సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు క‌థ అందిస్తున్నాడు.

అయితే, రచయిత చెల్ల‌ముత్తు.. దర్శక, రచయిత కార్తీక్ సుబ్బరాజు ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖలో ప‌ని చేశాడు. ఈ సమయంలోనే తన క‌థ‌ని కార్తీక్ కాపీ కొట్టాడ‌ని చెల్ల‌ముత్తు ఆరోపిస్తున్నారు. మరోవైపు శంకర్ బాలీవుడ్ లో తెరకెక్కించేందుకు సిద్దమైన అపరిచితుడు రీమేక్ పై కూడా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆ కథ హక్కులు తన దగ్గర ఉండగా శంకర్ రీమేక్ ఎలా చేస్తారని సౌత్ ఇండియా ఛాంబర్ లో ఫిర్యాదు చేయగా.. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. మరి ఈ వివాదాల మధ్య శంకర్ సినిమాలు ఎలా గట్టెక్కుతాయో చూడాలి.