ArjunaPhalguna: ఒక తీయని మాటతో కళ్ళు మెరిసే.. మరో లిరికల్ సాంగ్ విడుదల Another lyrical song OkaTheeyaniMaatatho released from ArjunaPhalguna

ArjunaPhalguna: ఒక తీయని మాటతో కళ్ళు మెరిసే.. మరో లిరికల్ సాంగ్ విడుదల

తెలుగులో ఉన్న కుర్ర హీరోల్లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ArjunaPhalguna: ఒక తీయని మాటతో కళ్ళు మెరిసే.. మరో లిరికల్ సాంగ్ విడుదల

ArjunaPhalguna: తెలుగులో ఉన్న కుర్ర హీరోల్లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ‘జోహార్’ ఫేమ్ తేజా మార్ని దర్శకత్వంలో అర్జున ఫల్గుణ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

F3 Movie: భీమ్లా దెబ్బ.. వాయిదా పడిన ఎఫ్-3!

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా వరసగా ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తూ హైప్స్ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్స్ విడుదల కాగా తాజాగా మూడవ సాంగ్ కూడా విడుదల చేశారు. గోదావరి వాళ్ళే సందమామ, కాపాడేవా.. రాపడేవా పాటలు ఇప్పటికే సందడి చేస్తుండగా ఇప్పుడు ఒక తీయని మాటతో కళ్ళు మెరిసే అంటూ లవ్ సాంగ్ సినిమా ప్రియులను ఆకట్టుకుంటుంది.

OTT Releases: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ఈ పాట పచ్చని పల్లెలు, మాగాణి నేలలలో తెరకెక్కిక్కించినట్లుగా కనిపిస్తుంది. అమృత అయ్యర్ క్యూట్ లుక్స్, శ్రీవిష్ణు ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఈ పాటకి స్పెషల్ అట్రాక్షన్ కాగా.. శృతి మించిన స్కిన్ షో, అనవసరపు సంగీత హోరు లేకుండా ఒక తీయ మాటతో పాట వినసొంపుగా అనిపిస్తుంది. శ్రీవిష్ణు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

×