Arjuna Phalguna: అమ్మోరులో దమ్మే ఈ అర్జునుడు.. మరో లిరికల్ సాంగ్ రిలీజ్!

తెలుగులో ఉన్న కుర్ర హీరోల్లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Arjuna Phalguna: అమ్మోరులో దమ్మే ఈ అర్జునుడు.. మరో లిరికల్ సాంగ్ రిలీజ్!

Arjuna Phalguna

Arjuna Phalguna: తెలుగులో ఉన్న కుర్ర హీరోల్లో టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ‘జోహార్’ ఫేమ్ తేజా మార్ని దర్శకత్వంలో అర్జున ఫల్గుణ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా వరసగా ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తూ హైప్స్ పెంచేస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రంలోని ‘పచ్చని వూళ్లే సందమామా… యాడ సూడు నీళ్లే సందమామా.. బంగారు మట్టే… సిరి పండెనిట్టా’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. గోదావరి జిల్లాల పల్లె వాతావరణానికి, అక్కడి మనస్తత్వాలకి అద్దం పడుతూ సాగిన ఈ పాటకి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పుడు కాపాడేవా రాపడేవా అంటూ సాగే మరో పాటని విడుదల చేశారు. అమ్మోరులో దమ్మే ఈ అర్జునుడు అంటూ ఈ పాటలో హీరో క్యాలిబర్ తెలిపేలా ఈ పాట సాగింది. మోహన భోగరాజు పాడిన ఈ పాట సినిమాలో కీలకం కాగా.. ఇప్పుడు విడుదల చేసిన లిరికల్ సాంగ్ కూడా యూట్యూబ్ లో దూసుకుపోతుంది.