Bangarraju: ‘నా కోసం మారావా నువ్వు’.. సిద్ శ్రీరామ్ నుండి మరో మ్యాజిక్!

తెలుగులో ఇప్పుడు మరో కొత్త గొంతు తళతళలాడుతున్న సంగతి తెలిసిందే. అదే సిద్ శ్రీరామ్. ఈ మధ్య కాలంలో సిద్ పాట లేకుండా సినిమా హిట్ కావడం కష్టమే అనేలా మారిపోయింది పరిస్థితి.

Bangarraju: ‘నా కోసం మారావా నువ్వు’.. సిద్ శ్రీరామ్ నుండి మరో మ్యాజిక్!

Bangarraju

Bangarraju: తెలుగులో ఇప్పుడు మరో కొత్త గొంతు తళతళలాడుతున్న సంగతి తెలిసిందే. అదే సిద్ శ్రీరామ్. ఈ మధ్య కాలంలో సిద్ పాట లేకుండా సినిమా హిట్ కావడం కష్టమే అనేలా మారిపోయింది పరిస్థితి. కొంత అరవం కొంత తెలుగు కలగలిసిన ఆ శబ్దానికి హీరోయిన్లే కాదు ప్రేక్షకులూ ఫిదా అవుతున్నారు. అందుకే ప్రేక్షకుల మనోభావాన్ని అర్ధం చేసుకొని మేకర్స్ కూడా సిద్ శ్రీరామ్ లేకుండా యూత్ ఫుల్ సినిమాకు సిద్ధపడడం లేదు.

Skylab: రండి బాబూ రండి.. ఆలస్యించిన ఆశాభంగం!

ముఖ్యంగా హీరో హీరోయిన్ మీద ప్రేమను చెప్పడానికి, ప్రేమలో లోతును చెప్పడానికి సిద్‌ శ్రీరామ్‌ గొంతు బాగా నప్పుతుంది. ఇప్పటికే ఇలాంటి ఎన్నో పాటలు ఈ గొంతు నుండి వచ్చినా వినేవారికి బోర్ అన్నదే లేదు. అందుకే ఇప్పుడు ఇదే తరహాలో మరో పాట వచ్చేస్తుంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి కొనసాగింపుగా బంగార్రాజు వస్తోన్న సంగతి తెలిసిందే.

Radhe Shyam: సాంగ్ వచ్చేసింది.. ‘నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే’!

సంక్రాంతి బరిలో బంగార్రాజు నివలనుండగా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది. కాగా, ఈ సినిమా నుండి నాకోసం మారావా నువ్వు.. లేక నన్నే మార్చేశావా నువ్వు అనే పాట లిరికల్ టీజర్ విడుదలైంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పూర్తి పాట డిసెంబర్ 5 సాయంత్రం 5:12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. టీజర్ ను బట్టి చూస్తే ఇది మరో బ్యూటీఫుల్ లవబుల్ మెలోడీగా కనిపిస్తుంది. మరికొన్నాళ్లు ఈ పాట వినిపించడం ఖాయంగా కనిపిస్తుంది.