Prabhas-Rajamouli: క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా.. మొదలైన కథా చర్చలు!

రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఛత్రపతి ప్రభాస్ ను రెబల్ స్టార్ ను చేస్తే.. బాహుబలి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ను

Prabhas-Rajamouli: క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా.. మొదలైన కథా చర్చలు!

Prabhas Rajamouli

Prabhas-Rajamouli: రెబల్ స్టార్ ప్రభాస్ – దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఛత్రపతి ప్రభాస్ ను రెబల్ స్టార్ ను చేస్తే.. బాహుబలి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఇక రాజమౌళి కూడా బాహుబలి సినిమాతో యూనివర్శల్ స్థాయికి చేరిపోయాడు. దీంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బావుంటుందని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ లో మరో భారీ ప్రాజెక్టుకు సిద్దమైనట్లు కథనాలొచ్చాయి.

దర్శకుడు రాజమౌళి ఇప్పటి వరకు అత్యధిక సినిమాలు చేసిన హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ కాంబినేషన్ లో ప్రస్తుతం నాలుగో సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతుంది. ప్రభాస్ తో ఇప్పటికే ఛత్రపతి, బాహుబలి సినిమాలు చేయగా.. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రభాస్‌ సినిమా కోసం స్క్రిప్ట్‌ సిద్దం చేయాల్సిందిగా మైత్రి మేకర్స్‌ రాజమౌళిని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై రాజమౌళితో చర్చలు జరపుతున్నట్లు వినికిడి.

ప్రస్తుతానికి దీనిపై అధికారిక ప్రకటన లేకపోగా.. ఇందులో నిజముందో లేదో తెలియాలంటే మేకర్స్‌ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే ప్రభాస్‌ రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి కాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోండగా ‘సలార్‌’ చిత్రం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. ఇటీవల బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందే ఆది పురుష్‌ మూవీ ఇటీవల సెట్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా దర్శకుడు నాగశ్విన్ దర్శకత్వంలో సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకుంది.