RRR: రాజమౌళి పోస్టర్‌పై కీరవాణితో మరోపేరు.. ఇదే తొలిసారి!

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం (RRR) సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా యూనిట్ చాలా పగడ్బంధీగా.. వేగంగా అడుగులు వేస్తుంది. అన్ని పక్కా ప్రణాళికతో దూసుకు పోతుంది.

RRR: రాజమౌళి పోస్టర్‌పై కీరవాణితో మరోపేరు.. ఇదే తొలిసారి!

Rrr (3)

RRR: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం (RRR) సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా యూనిట్ చాలా పగడ్బంధీగా.. వేగంగా అడుగులు వేస్తుంది. అన్ని పక్కా ప్రణాళికతో దూసుకు పోతుంది. ఇందులో భాగంగానే మొన్న ప్రమోషనల్ మేకింగ్ వీడియోను విడుదల చేసిన టీం ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఏకంగా మరో ప్రమోషనల్ సాంగ్ ను సిద్ధం చేస్తుంది. త్వరలోనే ఈ సాంగ్ విడుదల కానుంది.

కాగా, ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇతర భాషలకు చెందిన సంగీత దర్శకులను కూడా కలుపుకుంటున్నారు. తాజాగా యువ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ తో చర్చలు జరిపిన కీరవాణి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అనిరుధ్ ను అభినందించాడు. అనిరుధ్ కూడా కీరవాణి, ఆర్ఆర్ఆర్ టీంకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రమోషనల్ సాంగ్ లో తమిళ వెర్షన్ కోసం అనిరుధ్ పనిచేయనున్నాడు.

అయితే, కీరవాణి కాకుండా రాజమౌళి సినిమాకు మరో సంగీత దర్శకుడు పనిచేయడం ఇదే తొలిసారి. రాజమౌళి సినీ కెరీర్ లో ఇప్పటి వరకు తన సినిమాలకు ఒక్కడే సంగీత దర్శకుడు ఉన్నాడు. 2001లో విడుదలైన స్టూడెంట్ నెంబర్ 1 నుంచి 2021లో రాబోయే ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలకు కీరవాణినే సంగీత దర్శకుడు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమా పోస్టర్ పై కీరవాణి తప్ప మరో పేరు పడలేదు.

స్వయానా అన్నదమ్ముల పిల్లలైన రాజమౌళి, కీరవాణికి సినిమాకు మించిన అనుబంధం ఉండడం.. సినిమాకు సంబంధించి కంఫర్ట్ జోన్‌తో రాజమౌళికి మరో సంగీత దర్శకుడి గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏర్పడలేదు. దాంతో రెండు దశాబ్దాలుగా వీళ్ళ ప్రయాణం అలాగే సాగుతుంది. అయితే.. ఇప్పుడు కీరవాణి భాద్యతలలో కొంత మరికొంతమందికి అప్పగిస్తున్నారు. అది ప్రమోషన్ సాంగ్ కోసమే అవనీ క్రెడిట్ తమిళంలో అనిరుధ్ కి ఇవ్వాల్సిందే. మరి పోస్టర్ లో కూడా కీరవాణితో పాటు మరో పేరు కూడా ఉంటుందా లేదా చూడాలి!