KGF-2: మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కేజీఎఫ్-2

దేశమంతా దక్షణాది సినిమాల వైపు చూసేలా చేసిన సినిమాలలో కేజేఎఫ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. సినిమా విడుదల తరువాత కన్నడ ఇండస్ట్రీలో కూడా నేషనల్ లెవెల్లో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయగల హీరోలు ఉన్నారని నిరూపించారు. దీంతో ఇదే కాంబినేషన్ లో.. కేజేఎఫ్ సీక్వెల్ పార్ట్ 2 మొదలైంది.

KGF-2: మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కేజీఎఫ్-2

Kgf 2

KGF-2: దేశమంతా దక్షణాది సినిమాల వైపు చూసేలా చేసిన సినిమాలలో కేజేఎఫ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. సినిమా విడుదల తరువాత కన్నడ ఇండస్ట్రీలో కూడా నేషనల్ లెవెల్లో బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయగల హీరోలు ఉన్నారని నిరూపించారు. దీంతో ఇదే కాంబినేషన్ లో.. కేజేఎఫ్ సీక్వెల్ పార్ట్ 2 మొదలైంది. ఈ సినిమా మొదలు కాగానే భారీ అంచనాలను నమోదు చేయడంతో సినిమా నుండి వచ్చే ప్రతిదీ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.

ఈ సినిమా టీజర్ విడుదల చేసిన 24 గంటల్లోనే ఇండియాలో అత్యధిక వ్యూస్ పొందిన ట్రైలర్ గా రికార్డు సృష్టించగా ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డును సొంతం చేసుకోంది. జ‌న‌వ‌రి 7న విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ యూట్యూబ్​లో 200 మిలియన్ల వ్యూస్ సాధించి దుమ్మురేపుతోంది. ఈ టీజర్​ కు ఇప్పటివరకు 8.4 మిలియన్ లైక్స్ రావడం మరో విశేషం. హీరో యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం.. సినిమా కథను గుర్తు చేస్తూ… జరగబోయే కథను వివరిస్తూ ఈ టీజర్‌ను రూపొందించారు.

యష్ మేనరిజానికి తగ్గట్లుగా గూస్‌బంప్స్‌ తెచ్చే బీజీఎం, విజువల్స్‌తో ఆకట్టుకున్న టీజర్ సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొట్టడం విశేషం. అందుకే ఇప్పటివరకు ఆ వీడియో 20 కోట్లకుపైగా వ్యూస్‌ సాధించింది. దీంతోపాటు తమ వీడియో 8.4 మిలియన్లకుపైగా లైక్స్‌, 11 మిలియన్లకుపైగా కామెంట్స్‌, వంద కోట్లకుపైగా ఇంప్రెషన్స్‌ సంపాదించిందని యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే.. సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో అర్థమవుతోంది.