Nani : సమ్మర్ బరిలో సుందరం… నానికి మరో హిట్ గ్యారెంటీ..

నాని 28వ సినిమాగా 'అంటే సుందరానికి' తెరకెక్కుతుంది. ఈ సినిమాను 2022 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో నాని క్యారెక్టర్ నేమ్ ని నిన్న అనౌన్స్ చేశారు.

Nani :  సమ్మర్ బరిలో సుందరం… నానికి మరో హిట్ గ్యారెంటీ..

Nani 28

Nani :   సాధారణ స్థాయి నుంచి న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని గత సంవత్సరం ఆరంభంలో కొన్ని అపజయాలు, చేదు సంఘటనలు చూసినా చివర్లో మాత్రం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాతో థియేటర్లలో మంచి విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా ఇచ్చిన సక్సెస్ ని ఆస్వాదిస్తున్నాడు నాని. త్వరలోనే మరో సినిమాని కూడా రెడీ చేస్తున్నాడు నాని. నాని 28వ సినిమాగా ‘అంటే సుందరానికి’ తెరకెక్కుతుంది.

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి మంచి సినిమాలు అందించిన వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘అంటే సుందరానికి’ రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా చేస్తుంది. నిన్న ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఇది కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్ లాగానే అనిపిస్తుంది.

Nayanathara : ప్రియుడితో దుబాయిలో న్యూ ఇయర్ చేసుకున్న నయనతార

ఇందులో నాని క్యారెక్టర్ నేమ్ ని నిన్న అనౌన్స్ చేశారు. కేపీవీఎస్‌ఎస్‌పీఆర్‌ సుందర ప్రసాద్‌ అంటూ నాని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామ సుందర ప్రసాద్‌ లాంటి పెద్ద పేరుతో కామెడీ ఎంటర్టైనర్ తో నాని రాబోతున్నాడు. ఈ సినిమాతో కూడా మరోసారి నాని హిట్ కచ్చితంగా కొడతాడు అని అంటున్నారు అభిమానులు, ప్రేక్షకులు. ఈ సినిమాను 2022 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సారి సమ్మర్ వినోదం అప్పుడే మొదలైపోయింది. సమ్మర్ రేసులో నాని కూడా జాయిన్ అయిపోయాడు.