Ante Sundaraniki : మరో కొత్త రికార్డు సృష్టించిన నాని.. అమెరికాలో ఏడు 1 మిలియన్ డాలర్ సినిమాలు..

నానికి అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. నాని ఇప్పటికే పలు సినిమాలతో అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకున్నాడు. తాజాగా వచ్చిన అంటే సుందరానికి సినిమాతో........

Ante Sundaraniki : మరో కొత్త రికార్డు సృష్టించిన నాని.. అమెరికాలో ఏడు 1 మిలియన్ డాలర్ సినిమాలు..

Ante Sundaraniki

Nani :  ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “అంటే సుందరానికీ” సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. నాని, నజ్రియా జంటగా నటించిన ఈ సినిమాని వివేక్ ఆత్రేయ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద మంచి ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ గా నిలిచి హిట్ కొట్టింది. ఇక ఇక్కడ కలెక్షన్స్ లో పర్వాలేదనిపించినా యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూలు చేస్తుంది.

Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ సినిమా..

నానికి అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. నాని ఇప్పటికే పలు సినిమాలతో అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకున్నాడు. తాజాగా వచ్చిన అంటే సుందరానికి సినిమాతో కూడా ఈ ఫీట్ సాధించి సరికొత్త రికార్డ్ సాధించాడు. వరుసగా ఏడు సినిమాలతో 1 మిలియన్ డాలర్ మార్క్ అందుకొని నాని రికార్డు సృష్టించాడు. మొదటి వారంలో మంచి కలెక్షన్స్ సాధించిన అంటే సుందరానికి తాజాగా అమెరికా బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. మరో సారి ఈ రికార్డుతో న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం దసరా సినిమా చిత్రీకరణలో ఉన్నాడు నాని.