OTT : ఓటీటీలకు షాక్ ఇచ్చిన కేంద్రం.. ఇకపై ఓటీటీ సినిమాలకు కూడా ఆ యాడ్స్ ఉండాల్సిందే..

 సినిమా థియేటర్స్(Movie Theaters) లో, టీవీ(TV)ల్లో సినిమాలు వేసే ముందు పొగాకు ప్రాణానికి ప్రమాదకరం, పొగాకు క్యాన్సర్ కు కారణం అనే యాడ్స్ వేస్తారు. సినిమాలో కూడా సిగరెట్ తాగే సీన్స్ ఉంటే కింద పొగాకు ఆరోగ్యానికి హనికరం అనే టైటిల్స్ వేస్తారు.

OTT : ఓటీటీలకు షాక్ ఇచ్చిన కేంద్రం.. ఇకపై ఓటీటీ సినిమాలకు కూడా ఆ యాడ్స్ ఉండాల్సిందే..

Anti Tobacco warnings in OTT from now issued by Central Government

Anti Tobacco Ads :  సినిమా థియేటర్స్(Movie Theaters) లో, టీవీ(TV)ల్లో సినిమాలు వేసే ముందు పొగాకు ప్రాణానికి ప్రమాదకరం, పొగాకు క్యాన్సర్ కు కారణం అనే యాడ్స్ వేస్తారు. సినిమాలో కూడా సిగరెట్ తాగే సీన్స్ ఉంటే కింద పొగాకు ఆరోగ్యానికి హనికరం అనే టైటిల్స్ వేస్తారు. 2012 నుంచి ఇది అమలులో ఉంది. పొగాకు వాడకాన్ని తగ్గించడానికి, ప్రజల ఆరోగ్య దృష్ట్యా అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల కాలంలో ఓటీటీ(OTT) వాడకం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అనేక సినిమాలు ఓటీటీలోనే డైరెక్ట్ గా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే ఓటీటీకి సెన్సార్ లేదు, గత కొంతకాలంలో అడల్ట్ కంటెంట్ ఓటీటీల్లో ఎక్కువ అవడంతో పలువురు సెన్సార్ ఉండాలని కోరుతున్నారు. ఇక ఈ టుబాకో యాడ్స్ కూడా ఓటీటీ సినిమాలకు లేవు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓటీటీలకు షాక్ ఇచ్చింది.

Director Teja : థియేటర్ వర్సెస్ పాప్‌కార్న్.. మళ్ళీ మాట్లాడిన తేజ.. నా థియేటర్లో పాప్‌కార్న్ రేటు అంతే..

నిన్న మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఓటీటీల్లో ప్రసారమయ్యే సినిమాలకు కూడా సినిమా థియేటర్స్, టీవీలలో వేస్తున్నట్టే పొగాకు ఆరోగ్యానికి హానికరం, పొగాకు క్యాన్సర్ కు కారణం అనే యాడ్స్ వేయాలని, కనీసం 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు ఆ యాడ్స్ ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ యాడ్ కూడా విజువల్ గా, సౌండ్ తో పాటు లోకల్ భాషల్లో ఉండాలని తెలిపింది కేంద్రం. ఇది అమలు చేయడానికి మే 31 నుండి మూడు నెలల గడువు ఇస్తున్నట్టు, ఆ లోపు ఓటీటీల్లో ప్రసారమయ్యే అన్ని సినిమాలు, సిరీస్ లలోను యాంటీ టుబాకో యాడ్స్ ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది పాటించని ఓటీటీలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ తరపున సీరియస్ గా యాక్షన్ కూడా తీసుకుంటామని తెలిపారు. దీంతో త్వరలోనే ఓటీటీల్లో కూడా యాంటీ టుబాకో యాడ్స్ రానున్నాయి.