Anubhav Sinha : ఆ టైంలో షారుఖ్ ఫెయిల్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా కోరుకుంది.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా షారుఖ్ కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. డిఫరెంట్ సినిమాలు తీసే అనుభవ్ సిన్హా షారుఖ్ తో రా. వన్ అనే సినిమా తీసాడు. 2011లో వచ్చిన ఈ సినిమా అప్పటి సినిమాలకు....................

Anubhav Sinha : ఆ టైంలో షారుఖ్ ఫెయిల్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా కోరుకుంది.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Anubhav Sinha sensational Comments on Shahrukh Khan

Anubhav Sinha :  ఇటీవల బాలీవుడ్(Bollywood) అంతా పడిపోయిన టైం లో షారుఖ్(Shahrukh Khan) తన పఠాన్(Pathaan) సినిమాతో వచ్చి గ్రాండ్ సక్సెస్ ఇచ్చాడు. అందుకే షారుఖ్ ని బాలీవుడ్ కా బాద్ షా, కింగ్ ఖాన్ అనేది. అనేక సార్లు షారుఖ్ తన సినిమాలతో బాలీవుడ్ కి సూపర్ హిట్స్ ఇచ్చాడు. షారుఖ్ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన వాడే. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనుభవ్ సిన్హా షారుఖ్ కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

డిఫరెంట్ సినిమాలు తీసే అనుభవ్ సిన్హా షారుఖ్ తో రా. వన్ అనే సినిమా తీసాడు. 2011లో వచ్చిన ఈ సినిమా అప్పటి సినిమాలకు కొంచెం డిఫరెంట్ గా, భారీ బడ్జెట్ తో తీశారు. అప్పట్లోనే సినిమాకు దాదాపు 150 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. అప్పట్లో అది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఇంత పెట్టి సినిమా తీస్తున్నారా అంటూ చాలా మంది బాలీవుడ్ వాళ్ళే ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని, షారుఖ్ ఖాన్ పడిపోవాలని కోరుకున్నారట. ఇక సినిమా రిలీజ్ అయ్యాక కూడా చాలా మంది బాలీవుడ్ వాళ్ళు సినిమా గురించి నెగిటివ్ గా చెప్పారట. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చటంతో అప్పట్లోనే 250 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Mahesh Babu : శ్రీరామనవమికి SSMB 28 ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్సమెంట్? ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసిన చిత్రయూనిట్..

తాజాగా అనుభవ్ సిన్హా తన రీసెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్ని చెప్పడంతో సిన్హా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కూడా పఠాన్ ముందు వరకు షారుఖ్ బ్యాడ్ ఫేజ్ చూశాడు. కానీ మళ్ళీ పఠాన్ తో అంతా మారిపోయింది.