Anubhavinchu Raja: రిలీజ్ డేట్ ఫిక్స్.. రాజ్‌తరుణ్ ట్రాక్‌లో పడతాడా?

ఉయ్యాలా జంపాల సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ నుండి బిగ్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్.. కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో హీరో అనిపించుకున్నాడు. కానీ, ఆ తర్వాత దాదాపు డజను..

Anubhavinchu Raja: రిలీజ్ డేట్ ఫిక్స్.. రాజ్‌తరుణ్ ట్రాక్‌లో పడతాడా?

Anubhavinchu Raja

Anubhavinchu Raja: ఉయ్యాలా జంపాల సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ నుండి బిగ్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్.. కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో హీరో అనిపించుకున్నాడు. కానీ, ఆ తర్వాత దాదాపు డజను సినిమాలు చేసినా తొలి రెండు సినిమాల స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ప్లాప్ సినిమాలని చెప్పలేం కానీ.. చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఈ కుర్రహీరో చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు.

Raja Vikramarka: కార్తికేయకి అండగా నాని.. ట్రైలర్ ముహూర్తం ఫిక్స్!

ప్రస్తుతం రాజ్ తరుణ్ స్టాండ్ అప్ రాహుల్, అనుభవించు రాజా అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో అనుభవించు రాజా నవంబర్ 26న థియేటర్లలోకి రానుంది. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన రాగా.. టైటిల్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు సినిమా యూనిట్ కూడా ప్రమోషన్ మొదలుపెట్టి తాజాగా రిలీజ్ అనౌన్సమెంట్ పేరుతో ఓ ఈవెంట్ కూడా నిర్వహించింది.

Bigg Boss 5 : బిగ్ బాస్ 5లో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ల సందడి

నవంబర్ 26న విడుదల కాబట్టి.. ఈ సమయంలో 2 నుండి 3 వారాల వరకు పెద్ద పోటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సినిమాకి ఇది మంచి అవకాశంగా కనిపిస్తుంది. గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌లపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.

Evaru Meelo Koteeswarulu: హాట్ సీట్ లో దేవిశ్రీ, థమన్.. ఫన్ విత్ బ్రిలియంట్!

అన్నపూర్ణ లాంటి బ్యానర్, మూడు వారాల వరకు పెద్దగా పోటీలేని సమయం కావడంతో ఈ సినిమా సక్సెస్ కి మంచి అవకాశమే అనుకోవచ్చు. సినిమా కూడా హిలేరియస్ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది. భీమవరం కోడి పందేలు.. గోదావరి కామెడీతో ఈ సినిమాను నింపేసినట్లుగా కనిపిస్తుంది. మరి అనుభవించు రాజాతో రాజ్ తరుణ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పడతాడా లేదా అన్నది చూడాలి.