నా కూతురి వయసు.. ఆమెతో పెళ్లేంటి? ఆపండ్రాబాబు..

అనూప్‌ జలోటా, బిగ్‌బాస్‌ ఫేమ్‌ జస్లీన్‌ మథారు ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది..

  • Published By: sekhar ,Published On : May 6, 2020 / 12:59 PM IST
నా కూతురి వయసు.. ఆమెతో పెళ్లేంటి? ఆపండ్రాబాబు..

అనూప్‌ జలోటా, బిగ్‌బాస్‌ ఫేమ్‌ జస్లీన్‌ మథారు ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది..

లాక్‌డౌన్ వేళ నెటిజన్లకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌తో పాటు సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లతో మాంచి టైంపాస్ అవుతోంది. సెలబ్ వీడియోలకు కామెంట్స్ చేయడం, కొత్త, వింత పుకార్లు పుట్టించడం వంటివి చేస్తున్నారు. తాజాగా గజల్ సింగర్, భజన్ మేస్ట్రో, అనూప్ జలోటా, బిగ్‌బాస్ ఫేమ్ జస్లీన్ మథారు ప్రేమ వ్యవహారం గురించి మరోసారి చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారహో అంటూ వార్తలు వచ్చాయి.

Anup Jalota, Jasleen Matharu

ఇందుకు కారణం ఏంటంయ్యాఅంటే.. ఇటీవల జస్లీన్‌ చక్కగా సింధూరం పెట్టుకుని, గాజులేసుకుని పద్దతిగా నాట్యం చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అనూప్, జస్లీన్‌లు పెళ్లి చేసేసుకున్నారు, అసలు లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకోవడం ఎలా వీలుపడిందబ్బా అంటూ ట్రోల్‌ చేశారు. వీళ్ల పోరు తట్టుకోలేక స్వయంగా అనూప్ ఆ వార్తలపై స్పందించాల్సి వచ్చింది.

Anup Jalota, Jasleen Matharu

‘‘మరోసారి..జస్లీన్‌తో నా పెళ్లి జరిగినట్లు వార్తలు.. నిజం చెప్పాలంటే ఆమె కోసం వాళ్ల నాన్నతో కలిసి నేనూ అబ్బాయిని వెదికేపనిలో ఉన్నాను. కెనడాలో ఉంటున్న ఓ పంజాబీ కుర్రాడి గురించి వారికి వివరాలు అందజేశాను. బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత జస్లీన్‌కు నేనే దగ్గరుండి పెళ్లి చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకుంటా. తను నా శిష్యురాలు. నా కూతురు లాంటిది. ఇకనైనా ఇటువంటి పుకార్లు ఆపండ్రాబాబూ..’’ అంటూ ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్వూలో చెప్పారు.

Anup Jalota, Jasleen Matharu

వయసులో దాదాపు 35 ఏళ్ల వ్యత్యాసం గల వీరిద్దరు మేం ప్రేమలో ఉన్నామని చెప్పారు. అయితే హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత తూచ్.. అదంతా ప్రాంక్‌ అని కొట్టిపారేశారు. తమ మధ్య కేవలం గురుశిష్యులు అనే పవిత్రబంధం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.

Anup Jalota, Jasleen Matharu

అయినప్పటికీ వీరి గురించిన కథనాలు కథలు కథలుగా వచ్చాయి. దీంతో ‘Wo Meri Student Hai’(ఓ మేరీ స్టూడెంట్ హై) అనే సినిమా ప్లాన్ చేశారు. హైలెట్ ఏంటయ్యా అంటే ఈ సినిమాకు జస్లీన్ తండ్రి కేసర్ దర్శకుడు. ఇప్పుడు స్వయంగా అనూప్ వివరణ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతానికి వీళ్ల గురించి కొత్త పుకార్లేవీ పుట్టనట్టే అనుకోవాలి.