Anupam Kher : ఒకప్పుడు వాళ్ళ సినిమాల్లో కచ్చితంగా ఉండేవాడిని.. ఇప్పుడు బాలీవుడ్ నన్ను పట్టించుకోవట్లేదు..

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మీరెందుకు బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో చెయ్యట్లేదు అని అడగడంతో అనుపమ్ ఖేర్ దీనికి సమాధానమిస్తూ.. ''బాలీవుడ్ మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలలో, స్టార్స్ సినిమాలలో నేను ఇప్పుడు...............

Anupam Kher : ఒకప్పుడు వాళ్ళ సినిమాల్లో కచ్చితంగా ఉండేవాడిని.. ఇప్పుడు బాలీవుడ్ నన్ను పట్టించుకోవట్లేదు..

Anupam Kher Comments on Bollywood Stars

Anupam Kher :  బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ దాదాపు 500 సినిమాలకు పైగా నటించారు. ఒకప్పుడు బాలీవుడ్ ప్రతి హీరో సినిమాలో అనుపమ్ ఖేర్ కచ్చితంగా ఉండేవారు. కానీ ఇటీవల కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అనుపమ్ కనిపించట్లేదు. బాలీవుడ్ లో టైర్ 2 సినిమాల్లో చేస్తూ, తెలుగు, తమిళ్ సినిమాలలో అవకాశాలు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే తెలుగులో కార్తికేయ 2 సినిమాలో కనిపించి మెప్పించారు అనుపమ్ ఖేర్.

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మీరెందుకు బాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో చెయ్యట్లేదు అని అడగడంతో అనుపమ్ ఖేర్ దీనికి సమాధానమిస్తూ.. ”బాలీవుడ్ మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలలో, స్టార్స్ సినిమాలలో నేను ఇప్పుడు కనపడట్లేదు. కరణ్‌ జోహార్‌, సాజిద్‌ నదియావాలా, ఆదిత్య చోప్రా సినిమాలు ఇప్పుడు చెయ్యట్లేదు. ఒకప్పుడు వీళ్ళకి నేను డార్లింగ్ ని. వీళ్ళు తీసిన చాలా సినిమాల్లో నేను ఉన్నాను. కానీ ఇప్పుడు వాళ్లు నాకు ఒక్క ఆఫర్‌ కూడా ఇవ్వట్లేదు. నన్ను వాళ్ళ సినిమాల్లోకి తీసుకోకపోవడం నేనేమి తప్పుగా అనుకోవట్లేదు. కానీ వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లే నాకు అనేక దారులు ఉన్నాయని తెలిసింది. అందుకే ఇటీవల హిందీలో చిన్న సినిమాలు, తెలుగు, తమిళ్ సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తున్నాను. కాకపోతే నా స్నేహితులు నన్ను పక్కన పెట్టినందుకు కొంచెం బాధగా ఉంది” అని తెలిపారు.

Senior Actor Naresh Tweets : పెప్సి, పాప్‌కార్న్‌ రేట్లు తగ్గించకపోతే జనాలు థియేటర్లకు రారు.. సీనియర్ నటుడు నరేష్ ట్వీట్..

ఇప్పటికే బాలీవుడ్ పరిశ్రమ, బాలీవుడ్ మాఫియా అని చాలా నెగిటివ్ అభిప్రాయం ఉంది. అనుపమ్ ఖేర్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆ అభిప్రాయం మరింత బలపడటమే కాక మరోసారి బాలీవుడ్ పరిశ్రమ ఎలాంటిదో ఇండైరెక్ట్ గా తెలియచేశారు. ఇప్పుడు అనుపమ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో చర్చగా మారాయి.