Anupama Parameswaran: డబ్బిస్తే ఏదైనా చేస్తావా.. అనుపమకి నెటిజన్ల ట్రోలింగ్!

ఇండస్ట్రీలో తోటి హీరోయిన్స్ స్కర్ట్స్, బికినీలతో సెగలు పుట్టిస్తున్నా.. లిప్ లాక్స్, బెడ్ రూమ్ సన్నివేశాలకు కథ డిమాండ్ చేసిందని సై అంటున్నా కొందరు హీరోయిన్స్ మాత్రం వాటికి దూరం...

Anupama Parameswaran: డబ్బిస్తే ఏదైనా చేస్తావా.. అనుపమకి నెటిజన్ల ట్రోలింగ్!

Anupama Parameswaran

Anupama Parameswaran: ఇండస్ట్రీలో తోటి హీరోయిన్స్ స్కర్ట్స్, బికినీలతో సెగలు పుట్టిస్తున్నా.. లిప్ లాక్స్, బెడ్ రూమ్ సన్నివేశాలకు కథ డిమాండ్ చేసిందని సై అంటున్నా కొందరు హీరోయిన్స్ మాత్రం వాటికి దూరం ఉంటూ వస్తున్నారు. తెలుగులో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ లాంటి వారు ఈ రెండో జాబితాలో ఉంటారు. కానీ.. ఇప్పుడు అనుపమ కూడా ఈ జాబితా నుండి బయటకొచ్చేసింది. రూటు మార్చేసి అన్నిటికి సై అంటూ ఇప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు సిద్ధమైంది.

Rowdy Boys: లవ్, రొమాన్స్, కాలేజ్ ఫైట్స్.. ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్!

అనుపమ ప్రస్తుతం దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ తో రౌడీ బాయ్స్ అనే సినిమా చేస్తుంది. ఇది పక్కా యూత్ ఫుల్ సినిమా కాగా తాజాగా విడుదలైన ట్రైలర్ లో కూడా ఇదే చూపించారు. ఇందులో రొమాన్స్ కూడా ఎక్కువేనని ట్రైలర్ కట్ లోనే లిప్ లాక్ సన్నివేశాన్ని చూపించారు. ఇందులో ఐదారుసార్లు లిప్ లాక్స్, బెడ్ రూమ్ సన్నివేశాలు ఉన్నాయని.. ఇందులో అనుపమ రెచ్చిపోయి నటించిందని టాక్ నడుస్తుంది. ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలకు నెటిజన్లు అనుపమ మీద సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

Rowdy Boys: కృష్ణుడు వచ్చాడే.. రాధను చూశాడే.. ‘రౌడీ బాయ్స్’ సాంగ్ రిలీజ్!

నీకంటూ వ్యక్తిగత ఇమేజ్‌ లేదా.. ఎంత రెమ్యునరేషన్‌ ఇస్తే మాత్రం కొత్త కుర్రాళ్లకు లిప్‌లాక్‌ ఇచ్చేస్తావా?, కిస్‌ సీన్‌ చేయడానికి ఓ స్థాయి ఉండాలి. ఎంత అగ్ర నిర్మాత వారసుడు అయితే మాత్రం.. అది చూసుకోవా? రెమ్యునరేషన్‌ కోసం ఇంతగా దిగజారాలా’.. డబ్బిస్తే ఏదైనా చేస్తావా అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం ఈ సినిమా తర్వాత అనుపమ కెరీర్ టాలీవుడ్ లో మంచి స్వింగ్ లో సాగుతుందని.. యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అవుతుందని ఆశపడుతున్నారు.