Anurag Kashyap : అలాంటి సినిమాలు బాలీవుడ్‌లో వర్క్ అవుట్ కావు.. సౌత్ మూవీస్‌పై బాలీవుడ్ దర్శకుడు కామెంట్స్..

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి సౌత్ సినిమాలకు ఒక దారి కనిపించింది. ఈ నేపథ్యంలోనే.. పుష్ప, కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాలు హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా ఏంటో చూపించాయి. ఒకప్పుడు రీజనల్ సినిమాలు అంటూ హేళన చేస్తూ మాట్లాడిన బి-టౌన్ స్టార్స్, ఇప్పుడు అవే రీజినల్ మూవీస్ తాకిడిని తట్టుకోలేకపోతున్నారు.

Anurag Kashyap : అలాంటి సినిమాలు బాలీవుడ్‌లో వర్క్ అవుట్ కావు.. సౌత్ మూవీస్‌పై బాలీవుడ్ దర్శకుడు కామెంట్స్..

Anurag Kashyap comments on south movies

Anurag Kashyap : రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి సౌత్ సినిమాలకు ఒక దారి కనిపించింది. ఈ నేపథ్యంలోనే.. పుష్ప, కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాలు హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా ఏంటో చూపించాయి. ఒకప్పుడు రీజనల్ సినిమాలు అంటూ హేళన చేస్తూ మాట్లాడిన బి-టౌన్ స్టార్స్, ఇప్పుడు అవే రీజినల్ మూవీస్ తాకిడిని తట్టుకోలేకపోతున్నారు.

Urfi Javed : బిగ్‌బాస్ నటిపై నమోదైన పోలీస్ కేసు..

ఇక సౌత్ సినిమాలుపై బాలీవుడ్ ప్రేక్షకులు ఆశక్తి చూపించడంతో, బి-టౌన్ మేకర్స్ కూడా అటువంటి సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కామెంట్స్ చేశాడు. పుష్ప, కెజిఎఫ్, కాంతార, సైరాత్(మరాఠి ఫిల్మ్) సినిమాలు దేశవ్యాప్తంగా హిట్టుని అందుకొని ఉండవచ్చు. కానీ అటువంటి సినిమాలు ఇక్కడ వర్క్ అవుట్ కావు.

అయితే కశ్యప్ ఈ మాటలు ఏ ఉదేశంతో అన్నాడంటే.. ‘ప్రస్తుతం బాలీవుడ్ కి కావాల్సింది పాన్ ఇండియా స్క్రిప్ట్ లు కాదు, కొత్తదనం ఉన్న సినిమాలు. ఆ కొత్తదనం కోసం సౌత్ సినిమాలను కాపీ కొట్టి తెరకెక్కిస్తామంటే, అవి బాలీవుడ్‌లో వర్క్ అవుట్ అవ్వవు’ అనే భావనతో మాట్లాడాడు. ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే తరహాలో బాలీవుడ్ మేకర్స్ పై వ్యాఖ్యలు చేశాడు.