Covid test kits కోసం Filmfare trophyల వేలం పెట్టిన బాలీవుడ్

  • Published By: Subhan ,Published On : May 21, 2020 / 06:28 AM IST
Covid test kits కోసం Filmfare trophyల వేలం పెట్టిన బాలీవుడ్

ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్, రచయిత వరుణ్ గ్రోవర్, కమెడియన్ కునాల్ కమ్రా ట్రోఫీలు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. COVID-19 టెస్టు కిట్ల కోసం నిధులు సేకరించే క్రమంలో ఈ పని మొదలుపెట్టారు. 30రోజుల్లో రూ.13లక్షల 44వేలు నిధులు పోగు చేసి పది కిట్లు కొనుగోలు చేయాలనేది వాళ్ల కాన్సెప్ట్. తద్వారా వెయ్యి మందికి టెస్టులు నిర్వహించొచ్చు. 

కశ్యప్‌కు గ్యాంగ్స్ ఆఫ్ వశ్సేపూర్ సినిమాకు వచ్చిన ఫిల్మ్‌ఫేర్ ట్రోఫీని వేలానికి పెట్టేశారు. ‘ఎక్కువ వేలం ధర పలికిన వాడికే ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ బెస్ట్ ఫిల్మ్ 2013 చెందుతుందని’ కశ్యప్ ట్వీట్ చేశాడు. ఆయుష్మాన్ ఖురానా-భూమి పడ్నేకర్ నటించిన దమ్ లగా కే హైశాలోని మో మో కే దాగే లిరిక్స్ కు వచ్చిన ట్రోపీని వేలం పెట్టేందుకు వరుణ్ గ్రోవర్ రెడీ అయ్యాడు. 

‘TOIFA ట్రోఫీతో పాటు మో మో కే దాగే (DLKH 2015)ను చారిటీ వేలానికి ఉంచుతున్నాను. వచ్చిన నిధులను కొవిడ్ టెస్ట్ కిట్ల కోసం వాడతాం. నా రిటైర్మెంట్ ప్లాన్ లో భాగంగా దానిని 2050లో ebayలో ఉంచాలనుకున్నా. కానీ, ఇండియా భవిష్యత్ కాపాడటానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా’ అని రాసుకొచ్చాడు. 

కమ్రా తన యూట్యూబ్ బటన్ ను ఇచ్చేసేందుకు సిద్దమయ్యాడు. మోస్ట్ పాపులర్ ఛానెళ్లకు మాత్రమే వాడే ఈ బటన్ ను అమ్మేందుకు పూనుకున్నాడు. ఛారిటీ కోసం ఆర్టిస్టులు తమ ప్రైజ్ లను ఇలాంటి క్లిష్ట సమయంలో విరాళమిస్తారని అనుకుంటున్నా’ అని కమ్రా ట్వీట్ చేశాడు. 

ఒక్కో టెస్టింగ్ కిట్ రూ.1.2లక్షలు+GST ఉంటుందని వంద శాంపుల్స్ వరకూ టెస్టు చేసే సామర్థ్యం దానికి ఉంటుంది. పది టెస్టింగ్ కిట్లు కొని 1000మంది వరకూ ఉచితంగా టెస్టులు నిర్వహించాలని వారి ఆలోచన. 

Read: షూటింగ్ లు ఎలా : చిరంజీవి ఇంట్లో కీలక భేటీ..మంత్రి తలసాని హాజరు