Vikram : స్టార్ డైరెక్టర్ వర్సెస్ హీరో విక్రమ్.. సోషల్ మీడియాలో వార్.. డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్న విక్రమ్ ఫ్యాన్స్..

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. హీరో విక్రమ్ అసలు పేరు జాన్ కెన్నెడీ. అతన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ కథ రాశాను. నేను ఈ సినిమా విక్రమ్ తో చేద్దామని సంప్రదించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Vikram : స్టార్ డైరెక్టర్ వర్సెస్ హీరో విక్రమ్.. సోషల్ మీడియాలో వార్.. డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్న విక్రమ్ ఫ్యాన్స్..

Anurag Kashyap Vs Vikram tweets goes viral

Anurag Kashyap :  బాలీవుడ్(Bollywood) స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్(Anurag Kshyap)ప్రస్తుతం కాన్స్ ఫిలిం ఫెస్టివల్(Cannes Film Festival) లో పాల్గొంటున్నాడు. తాను తెరకెక్కించిన కెన్నెడీ సినిమా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుంది. రాహుల్ భట్, సన్నీ లియోన్(Sunny Leone) జంటగా కెన్నెడీ(Kennedy) సినిమాలో నటించారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా గురించి అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. హీరో విక్రమ్ అసలు పేరు జాన్ కెన్నెడీ. అతన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ కథ రాశాను. నేను ఈ సినిమా విక్రమ్ తో చేద్దామని సంప్రదించినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు, అందుకే రాహుల్ తో ఈ సినిమా చేశాను అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి విక్రమ్ వరకు చేరడంతో విక్రమ్ దీనిపై ఓ ట్వీట్ చేశాడు.

 

విక్రమ్ తన ట్విట్టర్ లో అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. డియర్ అనురాగ్ కశ్యప్.. సోషల్ మీడియాలో ఉన్న మన స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఒక ఏడాది క్రితం మన మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా కోసం మెయిల్, మెసేజ్ రూపంలో నన్ను సంప్రదించినప్పటికీ నా నుంచి ఎలాంటి సమాధానం రాలేదని మీరు ఓ నటుడితో చెప్పారు. అతను నాకు చెప్పడంతో నేను మీకు ఫోన్ చేశాను. మీరు మెసేజ్ చేసిన మెయిల్ ఐడి యాక్టివ్ గా లేదని, నంబర్ కూడా రెండేళ్ల క్రితమే మార్చేశానని మీకు అప్పుడే చెప్పాను. కెన్నెడీ కథ కూడా నాకు నచ్చిందని చెప్పాను అని ట్వీట్ చేశారు.

దీనికి అనురాగ్ కశ్యప్ జనాలకు సమాధానమిస్తూ.. నిజమే బాస్. ఒక నటుడి ద్వారా విషయం తెలుసుకున్న మీరు నన్ను సంప్రదించారు. అప్పుడే మీ అధికారిక మెయిల్ ఇది, ఫోన్ నెంబర్ తీసుకున్నాను. మీరు నా స్క్రిప్టు చదవడానికి ఆసక్తి కనిపించారు కానీ అప్పటికే నేను షూటింగ్ కి కూడా సిద్ధమైపోయాను. మా సినిమాకు కెన్నెడీ అని టైటిల్ పెట్టుకోవడానికి విక్రమ్ ఒప్పుకున్నారు. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవలం కెన్నెడీ అనే పేరు ఎందుకు పెట్టానో మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలను అతిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. నేను కచ్చితంగా భవిష్యత్తులో విక్రమ్ సర్ తో పనిచేస్తాను. ఆయనతో పనిచేయకుండా మాత్రం రిటైర్ అవ్వను అని ట్వీట్ చేశారు.

Dimple Hayathi : హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలుసా?

దీంతో ఇద్దరి ట్వీట్స్ వైరల్ గా మారగా పలువురు విక్రమ్ ఫ్యాన్స్ ఏదైనా చెప్పేముందు క్లారిటీగా చెప్పాలి కదా అని అనురాగ్ కశ్యప్ ని ట్రోల్ చేస్తున్నారు. అనురాగ్ ప్రస్తుతం ఈ కెన్నెడీ సినిమాని కాన్స్ లో ప్రదర్శించటానికి వెళ్లారు. ఇక విక్రమ్ ఇటీవల తంగలాన్ షూట్ లో గాయపడి చికిత్స తీసుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.