Anurag Thakur : ఓటీటీల్లో అశ్లీలతపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. యాక్షన్ తీసుకుంటాం..

సాధారణంగా ప్రేక్షకులకు అందించే ఎంటర్టైన్మెంట్ లో కచ్చితంగా సెన్సార్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్, మితిమీరిన హింస, బూతులు.. ఇలా వీటితో సినిమాలు తీసినా సెన్సార్ చేసి వాటని కట్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తారు. కానీ ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో ఓటీటీల్లో అశ్లీలత, బూతులు, హింస, రక్తపాతం వంటి అంశాలు ఎక్కువగా..................

Anurag Thakur : ఓటీటీల్లో అశ్లీలతపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. యాక్షన్ తీసుకుంటాం..

Anurag Thakur serious comments on obscene content in OTTs and said will ready to take action

Anurag Thakur :  కరోనా రావడంతో ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా సినిమాలు కరోనా టైంలో థియేటర్లు లేక డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా కొన్ని సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవుతూ వచ్చాయి. ఓటీటీకి డిమాండ్ పెరగడంతో ఆ ఓటీటీ సంస్థలే సొంతంగా సినిమాలు, సిరీస్ లు, షోలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, సోని లివ్, వూట్, ఆహా, ఆల్ట్ బాలాజీ, సన్ నెక్స్ట్, జీ5.. ఇలా అనేక ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.

సాధారణంగా ప్రేక్షకులకు అందించే ఎంటర్టైన్మెంట్ లో కచ్చితంగా సెన్సార్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్, మితిమీరిన హింస, బూతులు.. ఇలా వీటితో సినిమాలు తీసినా సెన్సార్ చేసి వాటని కట్ చేసి సినిమాలు రిలీజ్ చేస్తారు. కానీ ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో ఓటీటీల్లో అశ్లీలత, బూతులు, హింస, రక్తపాతం వంటి అంశాలు ఎక్కువగా చూపిస్తున్నారు. యూత్ ఎక్కువగా అట్రాక్ట్ కావడానికి సిరీస్ లలో అడల్ట్ కంటెంట్ ని కూడా జొప్పిస్తున్నారు. అయితే ఇవి కూడా ఒక లిమిట్ వరకు ఉంటే పర్లేదు కానీ ఇటీవల కొన్ని సిరీస్ లు హద్దు మీరు మరీ ఎక్కువ అడల్ట్ కంటెంట్ ని చూపిస్తున్నాయి.

Ugadi Movies : ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే..

దీంతో ఓటీటీ సంస్థలపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రానా నాయుడు సిరీస్ రిలీజవ్వగా ఇందులో మొత్తం అడల్ట్ కంటెంట్, బూతులు ఉండటంతో ఈ సిరీస్ పై, నెట్ ఫ్లిక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి. కొంతమంది ఈ సిరీస్ పై ఫిర్యాదులు కూడా చేశారు. తాజగా ఇలా వస్తున్న విమర్శలపై కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిష్టర్ అనురాగ్ ఠాకూర్ స్పందించారు. తాజాగా ఓ మీటింగ్ లో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఓటీటీలు ఉన్నది క్రియేటివ్ కంటెంట్ చూపించడానికి, అంతే కానీ అసభ్యకరమైన కంటెంట్ చూపించడానికి కాదు. ఇక ముందు కూడా ఇలాగే అసభ్యకరమైన కంటెంట్ చూపిస్తే కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఓటీటీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బ్రాండ్ కాస్టింగ్ శాఖ తరపున కొత్త గైడ్ లైన్స్ తీసుకురావాల్సి వస్తే ఆలోచించకుండా వెంటనే తీసుకువస్తాం అని హెచ్చరించారు. మరి కేంద్ర మంత్రి వ్యాఖ్యల తర్వాత కూడా ఓటీటీల్లో ఇంకా అడల్ట్ కంటెంట్ తో సిరీస్ లు, సినిమాలు స్ట్రీమ్ చేస్తారా చూడాలి మరి.