Anushka Sharma : నాలుగేళ్లు సినిమాకు దూరంగా ఉన్న అనుష్క శర్మ.. ‘ఖలా’ సినిమాతో సర్‌ప్రైజ్ చేసింది..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో భారత్ స్టార్ క్రికెటర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత పాపకి జన్మనిచ్చి అమ్మ అవ్వడంతో.. ఆమె వెండితెర మీద కనబడి నాలుగేళ్లు అయ్యిపోయింది. తాజాగా..

Anushka Sharma : నాలుగేళ్లు సినిమాకు దూరంగా ఉన్న అనుష్క శర్మ.. ‘ఖలా’ సినిమాతో సర్‌ప్రైజ్ చేసింది..

Anushka Sharma cameo role in qala

Anushka Sharma : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో భారత్ స్టార్ క్రికెటర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత పాపకి జన్మనిచ్చి అమ్మ అవ్వడంతో.. ఆమె వెండితెర మీద కనబడి నాలుగేళ్లు అయ్యిపోయింది. తాజాగా అనుష్క ఇప్పుడు ఒక సినిమాలో అతిధి పాత్రలో కనిపించి ఫ్యాన్స్ తో పాటు అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది.

Anushka Sharma : వింటేజ్ లుక్స్‌లో అదరగొడుతున్న అనుష్క..

అనుష్క నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో ‘ఖలా’ అనే ఒక సినిమాను తెరకెక్కించింది. సైకాలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలయింది. అన్వితా దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 60’s బ్యాక్‌డ్రాప్‌ కథనంతో సాగుతుంది. ఇక ఈ సినిమాలోనే ఒక చిన్న కామియో రోల్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది అనుష్క.

కాగా ఇప్పుడు అందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఖలా ప్రయాణంలో భాగం కావడం నాకు ఎంతో అందని ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చింది. ఇక వింటేజ్ లుక్ లో ఆమెను చూసిన అభిమానులు లైక్‌లు మీద లైక్‌లు కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా అనుష్క శర్మ తదుపరి క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందించబడిన ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’లో పూర్తి స్థాయి పాత్రలో కనిపించనుంది.