Anushka Shetty : 17 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎట్టకేలకు నెక్స్ట్ సినిమా షూట్ మొదలు పెట్టిన అనుష్క..

స్వీటీని చూసి రెండేళ్లవుతుందని చాలా మిస్ అవుతున్నారు ఫాన్స్. 2020లో నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క ఆ తర్వాత సడెన్ గా కనపడకుండా పోయింది. కొన్ని రోజుల క్రితం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై........

Anushka Shetty : 17 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఎట్టకేలకు నెక్స్ట్ సినిమా షూట్ మొదలు పెట్టిన అనుష్క..

Anushka

Anushka Shetty :  ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశామన్నదే పాయింట్ అంటోంది అనుష్క. ఏదో అలా వచ్చి ఇలా పోయే హీరోయిన్ లా కాకుండా, పర్పామెన్స్ కోసం కాకుండా, హీరో పక్కన రొమాన్స్ చేసే గ్లామర్ డాల్ లా కాకుండా ఈ జనరేషన్ హీరోయిన్లు అసూయ పడేంత పవర్ ఫుల్ రోల్స్ చేసింది అనుష్క. సంవత్సరంన్నర నుంచి అడ్రస్ లేకుండా పోయిన స్వీటీ సడెన్ గా ఎంట్రీ ఇచ్చి 17 ఇయర్స్ ఇండస్ట్రీ అంటోంది.

అనుష్క టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో నంబర్ వన్ హీరోయిన్. స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్నా కూడా ఏదో వచ్చిన ప్రతి సినిమానీ చెయ్యకుండా క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తుంది. అందుకే ఇండస్ట్రీకి వచ్చి 17ఏళ్లైనా ఇంకా 40 ప్లస్ సినిమాల దగ్గరే ఆగిపోయింది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత పవర్ ఫుల్ రోల్స్ చేశాం. ఎంత మెమరబుల్ రోల్స్ చేశాం అన్నదే పాయింట్ అంటోంది స్వీటీ.

Suriya : సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ ఓకే అయిందా?

ఇప్పటికే స్వీటీని చూసి రెండేళ్లవుతుందని చాలా మిస్ అవుతున్నారు ఫాన్స్. 2020లో నిశబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క ఆ తర్వాత సడెన్ గా కనపడకుండా పోయింది. ఏదో ప్రభాస్ బర్త్ డేకో, లేకపోతే ఇంకెవ్వరికో విషెస్ చెప్పడానికి తప్ప సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండట్లేదు. అయితే కొన్ని రోజుల క్రితం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ పోలిశెట్టి, అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి న్యూస్ రాలేదు. తాజాగా ఆ సినిమా షూట్ నుంచి అనుష్క 17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసింది. అది కూడా మొహం ఎక్కడా కనిపించకుండా ఓన్లీ కేక్ మాత్రమే కనిపించేలా నవీన్ పోలిశెట్టి తో చేస్తున్న సినిమా సెట్స్ మీద నుంచి పిక్ పోస్ట్ చేసింది అనుష్క.

నవీన్ పోలిశెట్టితో చేసే సినిమా షూట్ లో అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అయిన సందర్భంగా కేక్ కట్ చేయించారు. దానిని అనుష్క తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసి అసలు ప్రమోట్ చేయకుండా, ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా, సినిమా ఓపెనింగ్ కూడా లేకుండా షూటింగ్ ఇంత సైలెంట్ గా జరిగిపోతుందా అని షాక్ అయ్యారు ప్రేక్షకులు. ఎట్టకేలకు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న అనుష్క ఫ్యాన్స్ ఈ పోస్ట్ తో యాక్టీవ్ అయ్యారు. త్వరలోనే సినిమాతో రాబోతుందని ఎదురు చూస్తున్నారు.