ప్రభాస్ గురించి అలా అంది.. దెబ్బకి వీడియో వైరల్ అవుతోంది..

ప్రభాస్ గురించి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన అనుష్క.. ఆశ్చర్యపోయిన ఆడియన్స్..

  • Published By: sekhar ,Published On : March 19, 2020 / 12:40 PM IST
ప్రభాస్ గురించి అలా అంది.. దెబ్బకి వీడియో వైరల్ అవుతోంది..

ప్రభాస్ గురించి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన అనుష్క.. ఆశ్చర్యపోయిన ఆడియన్స్..

‘లేడి సూపర్ స్టార్’ అనుష్క, వెర్సటైల్ యాక్టర్ ఆర్.మాధవన్, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడిసన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో.. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ క్రాస్ ఓవర్ మూవీ ‘నిశ్శబ్దం’..  

ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ చేపడుతుంది టీమ్.. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్‌కు అనుష్క వెళ్లింది. ఆ కార్యక్రమంలో భాగంగా సుమ, ప్రభాస్ ఫోటో చూపిస్తూ.. ఒక పాజిటివ్ పాయింట్ చెప్పమంటే.. అనుష్క వెంటనే ‘నా కొడుకు గురించా?’ అనేసింది.

దాంతో సుమతో సహా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ప్రభాస్ మనుషులంటే చాలా చాలా ఇష్టముండే వ్యక్తి అని అనుష్క అనగా.. సుమ ‘మీ ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా’.. అంటే అనుష్క ‘నా కొడుకు కదండీ’ అంటూ పంచ్ పేల్చింది. 

అమరేంద్ర బాహుబలి గురించి చెప్పమంటే.. ‘అమరేంద్ర బాహుబలి క్వాలిటీసే వచ్చాయి కదా కొడుకుకి’ అని సమాధానమివ్వగా అందరూ అనుష్క సెన్సాఫ్ హ్యూమర్‌కు ఫిదా అయిపోయారు. అనుష్కతో పాటు సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, దర్శకుడు హేమంత్ పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.