Young Directors: ఫ్లాప్ రీజన్ ఏదైనా.. భారం మొత్తం డైరెక్టర్లదేనా?

ఆడియన్స్ కి నచ్చితేనే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోలు యాక్ట్ చేసిన సినిమా అయినా కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య చాలా మంది టాప్ డైరెక్టర్లు ఎంతో కష్టపడి చేసిన సినిమాలు కూడా ఒక్కోసారి నిరాశపరుస్తుంటాయి.

Young Directors: ఫ్లాప్ రీజన్ ఏదైనా.. భారం మొత్తం డైరెక్టర్లదేనా?

Young Directors

Young Directors: ఆడియన్స్ కి నచ్చితేనే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోలు యాక్ట్ చేసిన సినిమా అయినా కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య చాలా మంది టాప్ డైరెక్టర్లు ఎంతో కష్టపడి చేసిన సినిమాలు కూడా ఒక్కోసారి నిరాశపరుస్తుంటాయి. ఫ్లాప్ రీజన్ ఏదైనా బ్లేమ్ చేసేది మాత్రం డైరెక్టర్ నే. సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ హీరోకి. ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ వల్లనే అంటోంది ఇండస్ట్రీ. అప్పటి వరకూ ఎన్ని గొప్ప సినిమాలుచేసినా.. ఎన్ని సక్సెస్ లు ఇచ్చినా.. అవన్నీ హీరోకే. కానీ సినిమా వర్కవుట్ కాకపోతే.. డైరెక్టర్ బాగా తియ్యలేదని దర్శకుడ్నే పావుని చేస్తారు జనాలు.

Young Directors: కేరాఫ్ సెన్సేషన్.. స్టార్ డైరెక్టర్లను చేసిన ఒక్క సినిమా!

ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో రిలీజ్ అయిన రాదేశ్యామ్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. పీరియాడిక్ లవ్ స్టోరీగా దాదాపు 300 కోట్లకు పైగా తెరకెక్కినఈ రెట్రో మూవీ 100కోట్లకు పైగా నష్టాల్ని మిగిల్చింది. రాధాకృష్ణ జస్ట్ జిల్ అనే ఒక్క సినిమా మాత్రమే చేసి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ తో సినిమా ఛాన్స్ అయితే కొట్టేశాడు కానీ.. ప్రభాస్ స్టార్ డమ్ ని ఎగ్జిక్యూట్ చెయ్యడంలో సక్సెస్ కాలేకపోయాడు. దాంతో సినిమా ఫ్లాప్ ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. పాన్ ఇండియా స్టార్ కి ఇంత పెద్ద ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ ని ఊరుకుంటారా..? సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు. అసలు ఇలాంటి స్టార్ హీరోతో లవ్ స్టోరీలేంటి.? ఆయన స్టామినా ఏంటి..ఆయన స్టార్ డమ్ ఏంటి..? సినిమాలు చెయ్యడం చేతకానప్పుడు ఊరికే ఉండాలి కానీ ఇలాటి చెత్త సినిమాలు చేస్తారా అంటూ తిట్టిపోశారు. దాంతో నెక్ట్స్ సినిమా ఊసు కూడా ఎత్తడం లేదు రాధాకృష్ణ.

Telugu Directors: పాన్ ఇండియా టార్గెట్.. ఈ దర్శకులకు ఇప్పుడిదే బిగ్ చాలెంజ్

రన్ రాజా రన్ లాంటి హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ చేసిన యంగ్ డైరెక్టర్ సుజిత్.. ప్రభాస్ తో యాక్షన్ మూవీ ఛాన్స్ దక్కించుకన్నాడు. అయితే 200కోట్లకు పైగా తెరకెక్కిన సాహో మూవీలో బాలీవుడ్ స్టార్ కాస్ట్, హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్, గ్రాండియర్ విజువల్స్ ఉన్నాయి కానీ.. సినిమా స్టోరీ విషయంలో మాత్రం దెబ్బకొట్టింది. యాక్షన్ ఎక్కువై ఎమోషన్ మిస్ అవ్వడం, ప్రభాస్ ని కంప్లీట్ గా మాస్ యాంగిల్ లోనే చూపించడంతో భారీ యాక్షన్ మూవీ అయిన సాహో తెలుగులో సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో అసలు పాన్ ఇండియా స్టార్ తో సినిమా ఛాన్స్ రావడమే గొప్ప.. అలాంటిది ఆ ఛాన్స్ ని వాడుకోకపోగా.. ఇలాంటి చెత్త తీసి ఆడియన్స్ మీద వేస్తావా అంటూ ఫ్లాప్ కి సుజితే రీజనంటూ ఆడిపోసుకున్నారు. దాంతో చిరంజీవితో చెయ్యాల్సిన సినిమా ఛాన్స్ కూడా పోగొట్టుకున్నాడు సుజిత్.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

శివనిర్వాణ.. ఈయంగ్ డైరెక్టర్.. లవ్ స్టోరీల్ని అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కించి సూపర్ సక్సెస్ లు సాధించాడు. నాని తో నిన్నుకోరితో న్యూ ఏజ్ లవ్ స్టోరీ చేసినా.. మజిలీ సినిమాతో సమంత, నాగచైతన్యల ప్రేమని కళ్లకు కట్టినట్టు చూపించి మెమరబుల్ హిట్ అందించినా అది శివనిర్వాణ మేకింగ్ వల్ల జరిగిన మ్యాజికే. అయితే టక్ జగదీష్ తో ఆడియన్స్ లో ఉన్న ఈ ఒపీనియన్ ఒక్క సారిగా మారిపోయింది. నాని చేసిన యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా టక్ జగదీష్.. అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ఏమాత్రం మంచి టాక్ సంపాదించుకోలేకపోయింది. దాంతో సినిమా డిజాస్టర్ కి కారణం శివ అంటూ అందరూ పాయింట్ అవుట్ చేశారు. అసలే మాత్రం కంటెంట్ లేని డైరెక్టర్ అని డిసైడ్ చేసేసి టక్ జగదీష్ ఫ్లాప్ మొత్తాన్ని శివ మీదకే తోసేశారు జనాలు.

New Directors: ఈ హీరోల్ని మెప్పించలేకపోతున్న కొత్త దర్శకులు.. లోపం ఎక్కడ?

కొద్దో గొప్పో.. కామెడీ కంటెంట్ తో ఫన్ ని జనరేట్ చేస్తూ.. హిట్లు కొడుతున్న మారుతి కూడా కెరీర్ లో ఆడియన్స్ అదరించే సినిమాలు చేస్తున్నారు. అడల్ట్ కంటెంట్ ఉన్నా కూడా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి మారుతి సినిమాలు. నానితో భలే భలే మగాడివోయ్ తో మంచి సక్సెస్ ఇచ్చిన మారుతి, శర్వానంద్ కి కెరీర్ లో హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా మహానుభావుడు సినిమా చేశారు. అటు సాయిధరమ్ తేజ్ తో ప్రతి రోజూ పండగ సినిమా చేసి కోవిడ్ టైమ్ లో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఆడియన్స్ పల్స్ పట్టుకుని, ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడని ఆహా.. ఓహో అన్న జనాలే.. మంచిరోజులొచ్చాయ్ సినిమా చూసి.. అసలు దీన్ని సినిమా అంటారా.. మారుతికి సినిమా తియ్యడమే రాదు అంటూ ఫ్లాప్ ని మారుతి అకౌంట్ లో వేసేశారు.

New Directors: కంటెంట్‌తో కొడుతున్న కొత్త దర్శకులు.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు!

మొన్నీమధ్య బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ సినిమాతో డైరెక్టర్ గాపరిచయం అయిన కిరణ్ కొర్రపాటిని సోషల్ మీడియాలో తిట్టిపోశారు. సినిమా హిట్ అయితే హీరోకి క్రెడిట్ ఇచ్చే ఇండస్ట్రీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ నే టార్గెట్ చేస్తారు. అలా.. వరుణ్ తేజ్ మూవీ గని అనుకున్నట్టు తెరకెక్కలేదని, ఎక్కడో మిస్ ఫైర్ అయ్యిందని.. పబ్లిక్ గానే నోట్ రిలీజ్ చేసింది టీమ్. ఇంతగా ట్రోలింగ్ ఫేస్ చేసిన డైరెక్టర్ కిరణ్ కి మరో సినిమా చాన్స్ ఎన్నాళ్లకొస్తుందో..?

New Directors: ఏదో తడబాటు.. ఛాన్సిచ్చినా వాడుకోని డైరెక్టర్లు

ఫస్ట్ టైమ్ పాన్ సౌత్ మూవీగా రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ మూవీతో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర భరత్ కమ్మ. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా.. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా కాస్త దెబ్బేసింది. అప్పటికే గీతగోవిందం, టాక్సీవాలాతో మంచి సక్సెస్ లో ఉన్న విజయ్ కి ఫ్లాప్ ఇచ్చాడని, అసలు సినిమా చెయ్యడమే రాలేదని భరత్ ని టార్గెట్ చేశారు జనాలు. దాంతో డియర్ కామ్రేడ్ తర్వాత మరో సినిమా ఊసే ఎత్తకుండా పోయాడు భరత్ కమ్మ.

Tamil Directors: పెద్ద సినిమాల్ని హ్యాండిల్ చెయ్యలేకపోతున్న యంగ్ డైరెక్టర్లు

ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఆర్ ఎక్స్ 100 మూవీ అప్పటివరకూ ఉన్న తెలుగు సినిమా లవ్ స్టోరీల్ని మార్చి చూపించింది. దాంతో అజయ్.. సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. చిరంజీవి లాంటి టాప్ స్టార్లు కూడా తెగ మెచ్చుకున్నారు. అయితే రెండో సినిమాగా శర్వానంద్, సిద్దార్ద్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన రణరంగం మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ రిజల్ట్ అందుకున్నాడు. ఏదో ప్లూక్ లో ఆర్ ఎక్స్ 100 హిట్ అయ్యింది కానీ.. అజయ్ కి సినిమా చేసేంత సీన్ లేదని.. ఈ ఫ్లాప్ కి కారణం అజయ్ మేకింగే అని తేల్చేసింది ఇండస్ట్రీ.

Young Heroes: సక్సెస్ లేదు కానీ.. వరస సినిమాలను పట్టేస్తున్న లేత హీరోలు!

ఇలా కొత్త డైరెక్టర్లనుంచి స్టార్ డైరెక్టర్ల వరకూ ఎన్ని సక్సెస్ లు ఇచ్చినా.. ఎన్ని బ్లాక్ బస్టర్లు ఇచ్చి కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టినా.. తీరా ఒక్క ఫ్లాప్ వచ్చేసరికి అప్పటి వరకూ ఆహా ఓహో అన్న డైరెక్టర్లని కనికరం లేకుండా నిందిస్తున్నారు. హిట్ అయితే హీరో గొప్పతనం.. ఫ్లాప్ అయితే డైరెక్టర్ల చేతగాని తనం అంటోంది ఇండస్ట్రీ.